దేవరపల్లి: సెపక్‌తక్రా 36వ సీనియర్ బాలబాలికల సెపక్‌తక్రా తూర్పుగోదావరి జిల్లా జట్ల ఎంపిక పోటీలు జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక అంబటి సత్యనారాయణరావు జిల్లా పరిషత్ హైస్కూల్లో జరిగినట్టు పీఈటీ శ్రీనివాస్ తెలిపారు. బాలికల విభాగంలో పి.మధురశ్రీ, టి.నవ్యశ్రీ, మహాలక్ష్మి, ఎస్‌కే మనిషా బేగం, పి.బాల భవ్యశ్రీ ఎంపికయ్యారు. బాలుర విభాగంలో సీహెచ్ సతీష్, ఎల్.గణపతి, టీఎస్‌ఎస్ వంశీ, పి.సాయి, కె.పవన్ కుమార్ ఎంపికై నట్టు ఆయన తెలిపారు. ఎంపికై న బాలబాలికల జట్లు ఈ నెల 10, 11 తేదీల్లో అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగే రాష్ట్ర స్థాయి సెపక్‌తక్రా పోటీల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు.


