సామర్లకోట: స్థానిక బచ్చుఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాలుర, బాలికల జట్ల ఎంపిక జరిగింది. ఈనెల పదో తేదీ నుంచి 12వ తేదీ వరకు పశ్చిమ గోదావరి జిల్లా నూజివీడులో జరిగే 36వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలలో పాల్గొనే జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక జరిగింది. ప్రోకబడ్డీ రిఫరీ బోగిళ్ల మురళీ కుమార్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు డీవీవీ శ్రీనివాసు, కోశాధికారి ఎన్.కిరణ్‌ల పర్యవేక్షణలో ఎంపిక జరిగింది. జిల్లా నుంచి 80 మంది బాలురు, 50 మంది బాలికలు హాజరు కాగా ప్రతిభ ఆధారంగా పీడీలు జిల్లా జట్లకు ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులకు మాజీ మున్సిపల్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్రప్రసాద్ స్పోర్ట్స్ కిట్లు ఏర్పాటు చేశారు.
సబ్ జూనియర్ బాలిక జట్టు
కాకరపల్లి అరుణశ్రీ, మేరీ వివోనిక, కారపాటి భాగ్య శుభశ్రీ, కొండ్రే అఖిల, మచ్చా శృతి, గుర్రపు శిరీష, మాదవపూరి దర్శిత, పోతుల రామతులసి, మేరీ పద్మవల్లీ, ఐతి ఊర్విష, జుత్తుక లోవకుమారి, మాలగంటి రాధికదేవి, ఆచంట మౌనికశ్రీ వర్షిణి, వేటుకూరి సుబ్బలక్ష్మి, గనిశెట్టి చిన్నారి, ఉమ్మిడి కేజియ, కొంగు అనిత, ఇంజేటి అక్షిత
సబ్ జూనియర్ బాలుర జట్టు
జి.వీరబాబు, పి.సాయిసురేంద్ర, జి.నరేష్, ఎం.దుర్గాప్రసాద్, కె.రాజా, బి.అజయ్, డి.శ్రీరంజిత్, ఎ.విష్ణువర్ధన్, ఓ.విజయ్, వి.సాయిదుర్గ, వి.రామ్‌చరణ్‌తేజ్, ఎన్.జగదీష్, జి.ప్రవీణ్, ఆర్.ప్రసన్నకుమార్, కె.ఎమోష్, డి.దుర్గాప్రసాద్, జి.ఏసుబాబు, పి.గంగామహేష్, సీహెచ్ పూర్ణ మణికంఠ.


