● ఆల మందలం.. రోడ్లు వదలం! | - | Sakshi
Sakshi News home page

● ఆల మందలం.. రోడ్లు వదలం!

Oct 5 2026 12:27 AM | Updated on Oct 5 2026 12:27 AM

● అరటి అబ్బురం..

● స్నేహమేరా జీవితం..

● పరంపరగా!

మండలం మొగలిపాలెంలో ఒక పంపర పనస చెట్టు చూపరులను అబ్బుర పరుస్తోంది. ఆవ డ్రెయిన్‌ పక్కన పొలం గట్టుపై ఉన్న ఈ చెట్టు నిండా కాయలతో ఆకర్షిస్తోంది. ఆరడుగుల చెట్టుకు సుమారు 30 కాయలు కాసాయి. దీనికి ఎటువంటి ఎరువు వేయలేదని పొలానికి వేసే ఎరువులను లాక్కుని ఇలా ఎదిగిందని రైతు, తణుకువాడ పీఏసీఎస్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ తాడి వెంకటరెడ్డి తెలిపారు. కాజులూరు

కలిసొచ్చే కాలంలో నడిచొచ్చే కొడుకన్నట్టు ఈ అరటి చెట్టు ఎదుగుతున్న క్రమంలోనే కాపు కాసి ఆకట్టుకుంటోంది. మండలంలోని మెరకపాలెంలో యెలుమర్తి బాబురావు ఇంటి ఆవరణలో అరటిచెట్టు కాండం నుంచి ఏకంగా నాలుగైదు గెలలు వచ్చాయని.. నిజానికి చెట్టుకు ఒక గెల మాత్రమే వస్తుందని ఆయన తెలిపారు.

రాజోలు

జాతివైరాన్ని మరచి ఓ వానరం, ఓ శునకం స్నేహమేరా జీవితం అంటూ పాడుకుంటున్నాయి. మండలం తిరుమలంపాలెంలో నెల రోజులుగా కలిసిమెలిసి తిరుగుతూ స్థానికులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రస్తుతం ఈ జోడీ గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ద్వారకాతిరుమల

పట్టణ పరిధిలోని మార్కెట్‌ యార్డు సమీపంలో సూరవరం రోడ్డులో పశువుల మంద వాహన చోదకులకు స్పీడ్‌ బ్రేకర్లుగా తయారయ్యాయి. మున్సిపల్‌ అధికారులు సంబంధిత యజమానులకు నోటీసులు ఇచ్చి మమ అనిపిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. తుని

అరటి చెట్టు మొదలు భాగంలో

ఉన్న అరటి గెలలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement