ఉసురు తీసిన తేనెటీగలు | - | Sakshi
Sakshi News home page

ఉసురు తీసిన తేనెటీగలు

Sep 18 2026 12:09 AM | Updated on Sep 18 2026 12:09 AM

లొల్ల లాకుల వద్ద దాడి

ఎనిమిది మందికి గాయాలు

వీరిలో ఒకరి మృతి

ఆత్రేయపురం: తేనెటీగలు ఓ వ్యక్తి ఉసురు తీశాయి. వివరాలివీ.. ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల వద్ద పలువురు కూలీలు బుధవారం వీబీజీరాంజీ (ఉపాధి హామీ పథకం) పనులు చేస్తున్నారు. వారిపై ఉదయం 11 గంటల సమయంలో తేనెటీగలు ఆకస్మికంగా దాడి చేశాయి. ఈ దాడిలో ఆత్రేయపురం మాదిగపేటకు చెందిన యార్లగడ్డ సత్యానందం (71), కాకిలేటి చంద్రరావు, కె.లక్ష్మి, ఎస్‌.జ్యోతికుమారి, యు.పరంజ్యోతి, కె.భవాని, కె.చంద్రకళ, కె.బుజ్జి గాయపడ్డారు. వారిని వీబీజీరాంజీ ఏపీఓ విజయారెడ్డి, ఇతర సిబ్బంది వెంటనే స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. చికిత్స అనంతరం, ఇంటికి తరలించారు. వీరిలో సత్యానందం రాత్రి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటూ మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement