పీడీఎస్‌ బియ్యం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

పీడీఎస్‌ బియ్యం పట్టివేత

Sep 17 2026 12:26 AM | Updated on Sep 17 2026 12:26 AM

రెండు వాహనాల సీజ్‌

సరకు విలువ రూ.4.6 లక్షలు

కిర్లంపూడి: పీడీఎస్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న రెండు వాహనాలను సీజ్‌ చేసినట్టు ఎస్సై జి.సతీష్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు మండలంలోని కృష్ణవరం టోల్‌ప్లాజా వద్ద బుధవారం ఉదయం రాజమహేంద్రవరం విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్సై అవినాష్‌, తమ పోలీస్‌ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ నిర్వహించారు. దీనిపై అడ్డతీగల నుంచి జగ్గంపేట వైపు వెళుతున్న అశోక్‌ లే లాండ్‌ బడాదోస్త్‌, బొలెరో వాహనాలు తనిఖీలు చేయగా సుమారు రూ.4.6 లక్షల విలువైన పీడీఎస్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. దీంతో వాహనాలను అదుపులోకి తీసుకుని సీజ్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. బియ్యాన్ని పౌర సరఫరాల అధికారులకు అప్పగించి, రవాణా చేస్తున్న వారిపై 6ఏ కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ అడ్డతీగల, ఎర్రవరం గ్రామాల నుంచి జగ్గంపేట పరిసరాల్లోని పౌల్ట్రీ ఫారాలు, ఫిష్‌ఫారాలు, బ్రిక్స్‌ వర్కర్లకు ఈ బియ్యాన్ని విక్రయిస్తున్నట్టు తెలిపారు. ఈ తనిఖీల్లో ఏఓ శ్రీరామ్‌, ఏఎంవీ ఇన్‌స్పెక్టర్‌ కళాజ్యోతి, ఎంఎస్‌ఓ నాగబాబు, వీఆర్వో అచ్యుతరావు, వీర్రాజు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement