జాతీయ స్థాయి ఇన్‌స్పైర్‌కు ‘స్మార్ట్‌ బ్యాంగిల్‌’ | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి ఇన్‌స్పైర్‌కు ‘స్మార్ట్‌ బ్యాంగిల్‌’

Sep 17 2026 12:26 AM | Updated on Sep 17 2026 12:26 AM

రాయవరం: ఇన్‌స్పైర్‌ మనక్‌ పోటీల్లో సోమేశ్వరం జెడ్పీ ఉన్నత పాఠశాల సత్తా చాటింది. 2023–24 విద్యా సంవత్సరంలో 9వ తరగతి చదువుతున్న సాకా నాగ రమ్య రూపొందించిన ‘సేఫ్టీ బ్యాంగిల్‌ ఆర్‌ వాచ్‌ ఫర్‌ గరల్స్‌’ రాష్ట్ర స్థాయి ఆన్‌లైన్‌ ప్రదర్శనలో ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికై ంది. బాలికలు, మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ రూపొందించారు. అనివార్య పరిస్థితి ఎదురైనప్పుడు చేతికి ధరించిన స్మార్ట్‌ బ్యాంగిల్‌లో ఒక బటన్‌ నొక్కగానే ఇంటి వద్ద, మరొక బటన్‌ ప్రెస్‌ చేస్తే పోలీసుస్టేషన్‌, మరొక బటన్‌ ప్రెస్‌ చేస్తే 108 వాహనానికి అనుసంధానం చేస్తూ ప్రాజెక్టును రూపొందించారు. ప్రాజెక్టు రూపొందించిన నాగ రమ్య ప్రస్తుతం ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. దీంతో ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్న బర్నబాబు ప్రాజెక్టును ప్రదర్శించి, వివరించనున్నాడు. ప్రాజెక్టుకు సైన్స్‌ టీచర్‌ పి.మాధవి గైడ్‌గా వ్యవహరించారు. ఈ మేరకు నాగరమ్య, గైడ్‌ టీచర్‌ మాధవి, పాఠశాల హెచ్‌ఎం ఆర్‌.దయామణిని ఎంపీపీ నౌడు వెంకటరమణ, ఎంఈవోలు పి.రామలక్ష్మణమూర్తి, పోలిశెట్టి రాంబాబు తదితరులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement