సామర్లకోట: పెద్దాపురం మరిడమ్మ ఆలయ హుండీల ద్వారా రూ.6,50,826 ఆదాయం వచ్చినట్లు ఈఓ కె.విజయలక్ష్మి తెలిపారు. ఆగస్టు 17 నుంచి బుధవారం వరకు నెల రోజులకు సంబంధించి హుండీలను గురువారం లెక్కించారు. అమ్మవారి హుండీల ద్వారా రూ.6,21,222, అన్నదాన హుండీ ద్వారా రూ.29,604 ఆదాయం వచ్చినట్లు చెప్పారు. కానుకలుగా బంగారం 20.50 గ్రాములు, వెండి కిలో, 510 గ్రాముల హండీలలో లభించినట్లు తెలిపారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చింతపల్లి శ్రీహర్ష, దేవదాయశాఖ జేవీఓ వీవీ పళ్లంరాజు, తనఖీదారు వడ్డీ ఫణీంద్రకుమార్, ఈఓలు కె.లక్ష్మణ్, కె.జగదీశ్వరరావు, ట్రస్టు బోర్డు సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.


