సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): పుష్కరాల నిర్వహణకు అవసరమైన పారిశుధ్య పనులపై సమగ్రంగా చర్చించి కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆర్‌ఎంసీ, పంచాయతీరాజ్, కొవ్వూరు, నిడదవోలు, మండపేట మున్సిపల్ కమిషనర్లు, డివిజనల్ పంచాయతీ అధికారులు, డివిజనల్ అభివృద్ధి అధికారులతో ఈ మేరకు సమీక్షించారు. ఈ సందర్భంగా గత పుష్కరాల్లో నిర్వహంచిన పారిశుధ్య పనులపై చర్చించి రానున్న పరిస్థితులకు తగ్గట్టుగా చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ఘాట్ల పరిసరాల పరిశుభ్రత, వ్యర్థాల సేకరణ–తరలింపు, పారిశుధ్య సిబ్బంది, తాత్కాలిక మరుగుదొడ్లు, స్నానపు వసతులు, తాగునీరు, ఇతర అవసరమైన యాత్రికుల సౌకర్యాలు వంటి అంశాలను ముందుగానే గుర్తించి, వాటికి అనుగుణంగా మౌలిక వసతులు, మానవ వనరులను అంచనా వేయాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, సహాయ కలెక్టర్ కె.ఆదిత్య శర్మ అధికారులు పాల్గొన్నారు.
కాలుష్యాన్ని నియంత్రించాలి
నగరంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు శాసీ్త్రయ అధ్యయనాల ఆధారంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ కీర్తి అధికారులను ఆదేశించారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్‌పై జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. నగరంలో గాలి నాణ్యతపై నిర్వహించిన శాసీ్త్రయ అధ్యయనాల వివరాలను పరిశీలించి, కాలుష్యానికి ప్రధాన కారణాలు, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. శాసీ్త్రయ అధ్యయనాల ప్రకారం నగరంలోని దివాన్‌చెరువు, కంబాలచెరువు, ఆనం కళాకేంద్రం, ఆంధ్ర పేపర్ మిల్లు తదితర ప్రాంతాల్లో కాలుష్య స్థాయి అధికంగా ఉన్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఆయా ప్రాంతాల్లో కాలుష్యానికి కారణాలను గుర్తించి, వాటి నియంత్రణకు, వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ–ఆటోలు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు.
పుష్కర పనులపై కలెక్టర్ సమీక్ష


