ఫ అధికారుల దాటవేత ధోరణి
ఫ అరకు ఎంపీ తనూజరాణి,
మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి
కూనవరం: ఏజెన్సీలోని పాఠశాలల్లో విద్యార్థులు అంతుచిక్కని రీతిలో మృత్యువాతకు గురవుతుంటే కూటమి ప్రభుత్వం స్పందించడం లేదని అరకు ఎంపీ గుమ్మా తనూజా రాణి, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. కూనవరం మండల పరిధి గొమ్ముగూడెం గ్రామాన్ని శనివారం వారు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికి పది మంది విద్యార్థులు మృతి చెందారన్నారు. ఏజెన్సీ మండలాల్లో విద్యార్థుల మరణ మృదంగం మోగుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. కూనవరం మండలంలో ఏడో తరగతి విద్యార్థిని జాహ్నవి వైద్యం అందక మృతి చెందిందని, ఎటపాక మండలం విస్సాపురం పంచాయతీ గొల్లగుప్పలో ఇద్దరు మృతి చెందగా, మరో 50 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందేనని చెప్పారు. గొల్లగుప్పలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు స్పందించిన తీరు అమోఘమన్నారు. అనంతరం ప్రజలు వివిధ సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు.


