హైకోర్టు న్యాయవాదులుగా ఇద్దరి ప్రమాణం | - | Sakshi
Sakshi News home page

హైకోర్టు న్యాయవాదులుగా ఇద్దరి ప్రమాణం

Sep 13 2026 12:30 AM | Updated on Sep 13 2026 12:30 AM

కొత్తపేట: హైకోర్టు న్యాయవాదులుగా కొత్తపేటకు చెందిన ఇద్దరు అర్హత సాధించారు. వారిలో స్థానిక జెడ్పీటీసీ సభ్యురాలు గూడపాటి రమాదేవి ఒకరు కాగా, స్థానిక న్యాయవాది గూడపాటి విజయకుమార్‌ మరొకరు. శనివారం అమరావతి హైకోర్టు భవనం ఏపీ బార్‌ కౌన్సిల్‌ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో కౌన్సిల్‌ చైర్మన్‌ చలసాని అజయ్‌కుమార్‌ వీరితో ప్రమాణం చేయించారు. అనంతరం కౌన్సిల్‌ నుంచి హైకోర్టు లాయర్‌ సర్టిఫికెట్‌ను వారు అందుకున్నారు. రమాదేవి 2021లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరపున పోటీచేసి విజయం సాధించారు. గత ఐదేళ్లుగా స్థానిక సమస్యలపై జెడ్పీ, మండల పరిషత్‌ సమావేశాల్లో తన వాణి వినిపించి, వాటి పరిష్కారానికి కృషి చేశారు. రమాదేవి, విజయ్‌కుమార్‌లను వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు, ఎంపీపీ ఎం.గంగాధరరావు, నేతలు ఎం.వెంకటేశ్వరరావు ఎం.వీరభద్రరావు, జి.ప్రవీణ్‌కుమార్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement