డబ్బులిచ్చి పోస్టులు కొనుక్కున్న వాళ్లు ప్రజాసేవ చేయరు. అక్రమ సంపాదన పైనే దృష్టి సారిస్తారు. చంద్రబాబు ప్రభుత్వంలో అదే జరుగుతోంది. పోస్టుకింత అని కొనుకున్న వస్తున్న వారందరూ ప్రజలకు సేవ చేయడం మానేసి, దొడ్డిదారిన సంపాదించే పనిలో పడ్డారు. దీనికి ప్రజాప్రతినిధులు కూడా సహకరిస్తున్నారు. అందువల్లనే రాజమహేంద్రవరంలో శాంతిభద్రతలు క్షీణించాయి.
– బోడా వెంకట్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు
నాయకుడు కరెక్ట్‌గా ఉంటేనే..
నాయకుడు కరెక్ట్‌గా ఉంటేనే వ్యవస్థ కూడా సవ్యంగా ఉంటుంది. రాష్ట్రంలో ప్రస్తుత పాలకులు అంబేడ్కర్ రాజ్యాంగాన్ని కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు.
– రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఎమ్మెల్యే
వ్యవస్థలన్నీ నిర్వీర్యం
చంద్రబాబు పాలనలో అన్ని వ్యవస్థలూ నిర్వీర్యమైపోయాయి. దీంతో, అన్ని వర్గాల ప్రజలూ ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోను, దేశంలోను మద్యం, గంజాయి, మతం మత్తులో ప్రజలను ముంచేసి పబ్బం గడుపుకుంటున్నారు. ఈ పరిస్థితి మారకపోతే యువతకు తీవ్ర అన్యాయం జరగడంతో పాటు వారి భవిష్యత్ అంధకారమయమవుతుంది.
– మార్గాని నాగేశ్వరరావు, బీసీ సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు
ఈ పాలన అంతం కావాలి
గొంతెత్తితే అరెస్టులు.. ప్రశ్నిస్తే అరెస్టులు.. నిరనన తెలిపితే అరెస్టులు. ఇదేం పాలన? ఇంత దుర్మార్గపు పాలన వల్ల ప్రజలకు రక్షణ లేకుండా పోయింది. తమకు మంచి చేస్తారని ఎన్నుకుంటే మంచి చేయకపోగా ఇన్ని దారుణాలకు ఒడిగట్టటం ఎక్కడా చూడలేదు. ఇటువంటి పాలన అంతమవ్వాలి. చంద్రబాబు నీచ రాజకీయాలను ప్రజలు ఇక క్షమించరు.
– తాటిపాక మధు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు


