రాష్ట్రంలో అనేక దారుణాలు జరుగుతున్నాయి. వాటిని అడ్డుకుంటే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. బాధితుల పక్షాన నిలవాల్సిన పోలీసులు తిరిగి బాధితుల మీదనే కేసులు బనాయిస్తున్నారు. సంఘటన జరిగిన తర్వాత సీసీ కెమెరాలు పని చేయడం లేదంటూ సాకులు చెబుతున్నారు. గత పుష్కరాల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే తొక్కిసలాట జరిగి 29 మంది భక్తుల ప్రాణాలు పోయాయి. అప్పుడు కూడా సీసీ కెమెరాలు పని చేయలేదనే చెప్పారు. బాధితులకు ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందో లేదో తెలియదు కానీ, 2029లో కొత్త ప్రభుత్వం వచ్చాక కచ్చితంగా న్యాయం జరుగుతుంది.
– అశోక్ కుమార్ జైన్,
చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు,
రాజమహేంద్రవరం


