వార్డుల పునర్విభజన అశాసీ్త్రయం | - | Sakshi
Sakshi News home page

వార్డుల పునర్విభజన అశాసీ్త్రయం

Sep 7 2026 12:15 AM | Updated on Sep 7 2026 12:15 AM

మాజీ ఎంపీ బోస్‌

రామచంద్రపురం రూరల్‌: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వార్డుల పునర్విభజనలో భాగంగా రామచంద్రపురం మున్సిపాలిటీని 28 వార్డుల నుంచి 32 వార్డులుగా పెంచిన విషయం విదితమే. ఈ మేరకు రామచంద్రపురం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆదివారం మాజీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, రామచంద్రపురం నియోజకవర్గ కోఆర్డినేటర్‌ పిల్లి సూర్యప్రకాశ్‌ల ఆధ్వర్యంలో మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ఇన్‌చార్జిలతో సమావేశం నిర్వహించారు. పట్టణంలో వార్డుల పునర్విభజన అశాసీ్త్రయంగా ఉందని బోస్‌ పేర్కొన్నారు. వార్డుల స్వరూప స్వభావాలు చూపించలేదని, సరిహద్దుల్లో స్పష్టత లేదని తెలిపారు. ప్రతి వార్డులోనూ సర్వే నంబర్ల ఆధారంగా వార్డులను గుర్తించడం వల్ల ఏ వార్డు ఏ ప్రాంతానికి వెళ్లిందనేది ఆయోమయంగా ఉందన్నారు. వార్డుల విభజన జరిగే సమయంలో అటు పార్టీల ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వార్డుల్లోని ప్రజలకు కనీస సమాచారం లేకుండా విభజన చేయడం సరైన పద్ధితి కాదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్‌పర్సన్‌ గాధంశెట్టి శ్రీదేవి, మాజీ వైస్‌ చైర్మన్‌ చింతపల్లి నాగేశ్వరరావు, మాజీ కౌన్సిలర్లు వాడ్రేవు సాయిప్రసాద్‌, బొక్కా సత్యనారాయణ, బాసిన నాగమణి, గాదె సీతా రామలక్ష్మి, పార్టీ పట్టణ కన్వీనర్‌ గాధంశెట్టి శ్రీధర్‌, పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు మల్లిడి సాయిలక్ష్మి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement