తాళ్లపూడి మండల పరిసర గ్రామాలైన పోచవరం, రాగోలపల్లి, తుపాకులగూడెం గ్రామాల రెవెన్యూ పరిధిలోని కొండలను అనుమతులు లేకుండా కొంతమంది మాఫియాగా ఏర్పడి తవ్వేస్తున్నారు. పర్యావరణానికి హాని కలిగించేలా వృక్షాలను తొలగించి మరీ గ్రావెల్ తరలిస్తున్నారు. చింతలపూడి కాలువ మట్టిని కూడా అక్రమంగా తీసుకుపోతున్నారు. ఇదేంటని ప్రశ్నించిన వారిని బెదిరిస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
– ఇండుగుల రామకృష్ణ, తాళ్లపూడి మండల బీజేపీ అధ్యక్షుడు
●


