అమలాపురం టౌన్: స్థానిక కుడుపూడి గోపాలకృష్ణ గోఖలే జిమ్‌లో శిక్షణ పొందిన తాడి ఆర్య రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో విజేతగా నిలిచాడు. ఎమ్మెల్సీ, కుడుపూడి గోపాలకృష్ణ గోఖలే పవర్ లిఫ్టింగ్ అండ్ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు కుడుపూడి సూర్యనారాయణరావు ఆ జిమ్ వద్ద విజేత ఆర్యను సత్కరించారు. ఇటీవల తిరుపతిలో జరిగిన అమరావతి చాంపియన్ షిప్ పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆర్య అండర్–17 విభాగం 60 కిలోల వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీలో రెండో స్థానంతో పాటు వెండి పతకాన్ని సాధించాడు. జిల్లా నుంచి ఏకై క వెయిట్ లిఫ్టర్‌గా విజయం సాధించిన ఆర్యను ఎమ్మెల్సీ అభినందించారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి, కోచ్ చీకురుమిల్లి కిరణ్‌కుమార్, అసోసియేషన్ అధ్యక్షుడు ముంగర ప్రసాద్, న్యాయవాది మట్టపర్తి అచ్యుత్, జిమ్ ప్రతినిధులు దొంగ చంద్రశేఖర్, కె.చలిత్ కృష్ణ గుప్తా, అక్షయ్, లోకేష్ పాల్గొన్నారు.


