సెల్ఫీలు దిగిన లోకేష్‌ ఎక్కడున్నాడు | - | Sakshi
Sakshi News home page

సెల్ఫీలు దిగిన లోకేష్‌ ఎక్కడున్నాడు

May 26 2026 3:02 AM | Updated on May 26 2026 3:02 AM

గత ప్రభుత్వంలో పెట్రోల్‌ బంకుల వద్ద సెల్ఫీ దిగి ధరలు పెరిగాయని విమర్శించిన లోకేష్‌.. ఇప్పుడు ఎక్కడున్నాడు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో మాత్రం ఇంధన ధరలు ఎందుకు పెంచుతున్నారు. ఇది అసమర్థ పాలనకు నిదర్శనం.

– చెల్లుబోయిన వేణు,

మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు

ప్రజలకు కాదని కాంట్రాక్టర్లకు వత్తాసు

పెట్రోల్‌, డీజిల్‌ కొరతతో ప్రజలు అల్లాడిపోతున్నా పట్టించుకోని సీఎం చంద్రబాబు.. అమరావతిలో కాంట్రార్లకు ధర తగ్గించమని కేంద్రానికి లేఖ రాసి తెప్పించుకున్నారు. దీన్ని బట్టి చూస్తే బాబుకు రాష్ట్ర ప్రజలపై ఎలాంటి ప్రేమ లేదని అర్థమవుతోంది.

– –మార్గాని భరత్‌రామ్‌, వైఎస్సార్‌ సీపీ

జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ

రాష్ట్రంలో అభివృద్ధి గాలికి

చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధిని గాలికి వదిలేసింది. అధికారంలోకి వస్తే పెట్రోల్‌ ధరలు పెంచమని ప్రగల్భాలు పలికిన లోకేష్‌. ప్రస్తుతం పెరుగుతున్న ధరలపై ఎందుకు స్పందించడం లేదు.

– జక్కంపూడి రాజా, వైఎస్సార్‌ సీపీ యువజన

విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే

వాహనాలు నడిపేదెలా?

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎన్నడూ లేనంగా పెరుగుతున్నాయి. కొన్నాళ్లు డీజిల్‌ కొరత ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు ధరలు పెంచడంతో కిరాయిలకు వెళ్లలేకపోతున్నాం. ఒకవేళ వెళ్లినా కిరాయి పెంచాల్సి వస్తోంది. పెంచితే ఎవరూ పిలవడం లేదు.

– బాలం రమేష్‌,

డ్రైవర్‌ సమిశ్రగూడెం, నిడదవోలు

Advertisement
 
Advertisement
Advertisement