ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
రాజానగరం: ప్రభుత్వ ఉపాధ్యాయ విద్య (బీఈడీ)లో ప్రవేశాలకు శుక్రవారం నిర్వహించే ఏపీ ఈడీసెట్–2026కు ఏర్పాట్లు పూర్తయ్యాయని ప్రాంతీయ సమన్వయకర్త, ఆదికవి నన్నయ యూనివర్సిటీ బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సుబ్బారావు బుధవారం తెలిపారు. ఈ పరీక్ష నిర్వహణకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో 16 కేంద్రాలను ఏర్పాటు చేశారు. తూర్పు గోదావరి జిల్లాలోని ఏడు కేంద్రాలలో 2609 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలోని తొమ్మిది కేంద్రాలలో 2013 మంది పరీక్షకు హాజరుకానున్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసేలా వసతులు కల్పించామని, ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సైన్స్ కోర్సుల వారికి, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు ఆర్ట్స్ కోర్సుల వారికి రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయన్నారు. నిర్ణీత సమయానికి గంటన్నర సమయం ముందుగా పరీక్ష కేంద్రాలకు వచ్చిన వారినే లోనికి అనుమతిస్తారన్నారు.
జేఈఈ (మెయిన్) ఫలితాల్లో
తిరుమల సంచలనం
రాజమహేంద్రవరం రూరల్: ప్రతిష్టాత్మక జేఈఈ (మెయిన్)బి–ఆర్క్ అండ్ బి–ప్లాన్ ఫలితాలలో తమ తిరుమల ఐఐటీ అండ్ మెడికల్ అకాడమీ విద్యార్థులు అత్యద్భుత ఫలితాలు సాధించినట్లు విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. బి.ప్లాన్ జనరల్ ఈడబ్ల్ల్యుఎస్ విభాగంలో గొల్లా ప్రభవ్‌తేజ ఆల్ ఇండియా రెండో ర్యాంకు, వివిధ కేటగిరీలలో పైలా హర్షాదిత్య 5, గెడ్డం రాజా నవీన్‌తేజ 10, గన్నమనీడి వాత్సల్య 16, కొండేటి మోహన్‌గణేష్ సంతోష్‌కుమార్ 55, గారపాటి కృష్ణమురారి 62, కురివెళ్ల లక్ష్మీ హంసిని 82, కూచిపూడి జశ్వంత్ సత్యసాయి 83, తాతపూడి అవినాష్ 93, లోవిశెట్టి వైష్ణవి 96 ర్యాంకులు సాధించారని తెలిపారు. 500 లోపు 48 మంది, వెయ్యి లోపు 102 మంది, 5 వేల లోపు 663 మంది, 10 వేల లోపు 921 మంది ర్యాంకులు సాధించారని ఆయన అన్నారు. బి ఆర్క్ విభాగంలో వివిధ కేటగిరీలలో జాతీయస్థాయిలో గొల్లా ప్రభవ్‌తేజ 33వ ర్యాంకు, పైలా హర్షాదిత్య 64, గెడ్డం రాజా నవీన్ తేజ 64, మోతూరి సాత్విక్ 94వ ర్యాంకు సాధించారని ఆయన తెలిపారు. 500 లోపు 18 మంది, 1000 లోపు 33 మంది, 5 వేల లోపు 300 మంది, 10 వేల లోపు 633 మంది ర్యాంకులు సాధించారని తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను తిరుమలరావు, అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్‌బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి అభినందించారు.


