ప్రతి బడి బస్సుకు స్పీడ్ గవర్నర్లు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. వచ్చే నెల 15వ తేదీలోగా ఎఫ్‌సీ చేయించుకోవాలి. ఎఫ్‌సీ, పర్మిట్, కండిషన్ లేని బస్సులను సీజ్ చేస్తాం.
– ఎన్.లక్ష్మీ శ్రీదేవి, మోటార్ వెహికల్ ఇనస్పెక్టర్, మండపేట
ఆకస్మిక తనిఖీలు చేస్తాం
పాఠశాలలు ప్రారంభం కాగానే స్కూల్ బస్సుల తనిఖీలు చేపడతాం. ఎఫ్‌సీ లేకుండా పాఠశాల బస్సులు రోడ్డెక్కితే కఠిన చర్యలు తప్పవు. జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని బడి బస్సులకు వెంటనే ఎఫ్‌సీ చేయించుకోవాలి.
– ఆర్.సురేష్, జిల్లా రవాణా అధికారి, రాజమహేంద్రవరం


