పోలేరమ్మ జాతరలో దేవీశ్రీ డ్యాన్స్‌ | - | Sakshi
Sakshi News home page

పోలేరమ్మ జాతరలో దేవీశ్రీ డ్యాన్స్‌

May 6 2026 8:01 AM | Updated on May 6 2026 8:01 AM

రాయవరం: మండలంలోని వెదురుపాకలో జరిగిన పోలేరమ్మ జాతరలో సినీ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌ డ్యాన్స్‌ చేసి అందరికీ ఉత్సాహ పరిచారు. అ మ్మవారి జాతరను పురస్కరించుకుని ఆయన వెదురుపాక గ్రామానికి చేరుకున్నారు. మంగళవారం తన ఇంటి వద్దే ఉన్న అమ్మవారి ఆలయంలో మొక్కు లు తీర్చుకున్నారు. అనంతరం ఉత్సవ కమిటీ ఏర్పా టు చేసిన గరగ నృత్యాలు, గారడీల వంటి సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. గరగ నృత్య కళాకారులు వేస్తున్న స్టెప్పులకు, డప్పుల దరువుకు ఆయన పాదం కలిపారు. కొన్ని నిమిషాల పాటు స్టెప్పులు వేసి అభిమానులను మరింత ఉత్సాహ పరిచారు. అనంతరం అభిమానుల తాకిడి అధికమవ్వడంతో అక్కడ నుంచి వెళ్లిప్యోఆరు. కాగా.. అమ్మవారికి వెదురుపాక పరిసర గ్రామాల ప్రజలు మొక్కులు చెల్లించారు. ఉత్సవ కమిటీ భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసింది.

పోలేరమ్మ జాతరలో డ్యాన్స్‌ చేస్తున్న

సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌

Advertisement
 
Advertisement
Advertisement