పాలిటెక్నిక్‌ ఎంట్రన్స్‌ పరీక్షా ఫలితాలో | - | Sakshi
Sakshi News home page

పాలిటెక్నిక్‌ ఎంట్రన్స్‌ పరీక్షా ఫలితాలో

May 6 2026 8:01 AM | Updated on May 6 2026 8:01 AM

రాజమహేంద్రవరం రూరల్‌: పాలిటెక్నిక్‌ ఎంట్రన్స్‌ పరీక్షా ఫలితాల్లో తమ విద్యార్థులు అద్భుత ఫలితాలతో సత్తా చాటారని తిరుమల విద్యాసంస్థల చైర్మన్‌ నున్న తిరుమలరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దిరసాల నాగ సత్య హిమసూర్య 120కి 120 మార్కులు సాధించాడన్నారు. ఉండవల్లి సంతోష్‌, జక్కంపూడి సత్య, జయధీర్‌ నాయుడు, తిర్రి కుషాల్‌, కెల్లా శ్రీదత్తా, ఈరంకి యశ్వంత్‌, వట్టూరి హరి సంపత్‌, కొలుపోటి రోహిత్‌ శ్రీసాయి, గంజికుంట సాయిచరణ్‌ గోవిందు 119 మార్కులతో మెరిశారని వివరించారు. 119 మార్కులకు పైన 12 మంది, 118 మార్కుల పైన 25 మంది, 117 మార్కుల పైన 34 మంది, 116 మార్కుల పైన 47 మంది, 115 మార్కుల పైన 60 మంది విద్యార్థులు సాధించారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ చాటిన విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement