ఉదయిస్తూనే భగ్గుమంటున్న భానుడిని కారు మబ్బులు కమ్మేశాయి. శర పరంపరలా దూసుకొచ్చే రవి కిరణాల స్థానే తనువుకు తాపం తీర్చేలా చిటపట చినుకులు వర్షించాయి. ఆ పూటంతా సుమారుగా అదే వాతావరణం జిల్లాలో చాలా చోట్ల కొనసాగింది. కొత్తపేటలో ఆదివారం ఉదయం 8.30 సమయంలో కారు మబ్బులు కమ్ముకుని భారీగా వర్షించాయి. వచ్చిన పని అయిపోయినట్టు మధ్యాహ్నం 2 గంటల సమయంలో రావులపాలెం–జొన్నాడ మధ్య గౌతమి గోదావరి బ్రిడ్జి మీదుగా నీలాకాశంలో పాల నురగలాంటి మేఘాల తేరులో ఎలా వచ్చినవి అలాగే వెళ్లిపోయాయి. వినువీధిలో ప్రకృతి చిత్రాలను స్థానికులు, ప్రయాణికులు తమ సెల్‌ఫోన్లలో క్లిక్‌మనిపించి మురిసిపోయారు.
– కొత్తపేట


