దేవరపల్లి: విద్యుత్ స్తంభంపై నుంచి ప్రమాదవశాత్తు పడి ఓ ప్రైవేటు ఎలక్ట్రీషియన్ మృతి చెందిన ఘటన గోపాలపురం మండలం గుడ్డిగూడెంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కధనం ప్రకారం గుడ్డిగూడేనికి చెందిన ప్రతిపాటి రాజశేఖర్ (31) శనివారం అర్ధరాత్రి సమయంలో విద్యుత్ శాఖ సిబ్బందితో కలిసి స్తంబం ఎక్కి తీగలు కలుపుతుండగా ప్రమాదవశాస్తు జారిపడి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. రాజశేఖర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వి.సుబ్రహమణ్యం తెలిపారు.


