రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరుకు చెందిన భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు గంటాడ వంశీకృష్ణను ప్రతిష్టాత్మక సర్ సీవీ రామన్ రాష్ట్ర స్థాయి పురస్కారం వరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ అండ్ ప్రొఫెసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఈ అవార్డును విజయవాడలో ప్రదానం చేసినట్లు ఆయన తెలిపారు. వంశీకృష్ణతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మరో 78 మంది ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తిని పెంపొందించడంలో వంశీకృష్ణ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా కమిటీ ప్రశంసించింది.
4 కేజీల గంజాయి స్వాధీనం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): నలుగురు యు వకుల నుంచి పోలీసులు శనివారం 4 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. టూటౌన్ సీఐ శివగణేష్ కథనం ప్రకారం.. స్థానిక పాడుబడిన రైల్వే క్వార్టర్స్ వద్ద పోలీసులు దాడి చేశారు. కృష్ణా జిల్లా వైఎస్సార్ కాలనీకి చెందిన కట్టా హేమంత్ కుమార్, గుడివాడ టౌన్ పెదవీధికి చెందిన ఎర్రగుంట్ల సాయికిరణ్, కోటిబొమ్మ సెంటర్‌కు చెందిన పల్లపు సాయి సుభాష్, సత్యనారాయణపురానికి చెందిన పెద్ది అభినయ్‌లను పట్టుకుని, గంజాయి బ్యాగ్ స్వాధీనం చేసుకున్నారు.


