అప్పనపల్లి ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలి. ఇది ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉంది. సాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఏటా వేసవిలో కొబ్బరి తోటలకు నీరు పెట్టేందుకు రూ.వేలు ఖర్చవుతుంది. ఈ సమయంలో మూడు నీటి తడులు కట్టాల్సి ఉంది. బోరు బావుల నుంచి వచ్చే నీరు ఉప్పు నీరు కావడంతో చవుడు బారి కొబ్బరి తోటలు దెబ్బతింటున్నాయి.
– తటవర్తి సూరిబాబు, రైతు, అప్పనపల్లి
ప్రభుత్వం స్పందించాలి
సారవంతమైన భూములకు సరైన సాగునీరు అందక ఎందుకూ పనికి రాకుండా పోతున్నాయి. సాగునీరు అందిస్తే లంక భూముల్లో బంగారం పండుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉప్పు నీటితో వ్యవసాయం సర్వనాశనమైంది. గతంలో లంక గ్రామాల్లోని కొబ్బరి తోటల్లో ఎన్నో పంటలు పండించేవారు. నీటి సమస్యతో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సాగునీరు అందించే దిశగా ప్రభుత్వం, పాలకులు చర్యలు తీసుకోవాలి.
– కొమ్ముల సూరిబాబు, రైతు, పెదపట్నంలంక


