గోకవరం: స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న 20 సెల్‌ఫోన్లను రికవరీ చేసినట్టు కోరుకొండ సీఐ సత్యనారాయణమూర్తి తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎస్సై పవన్‌కుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ పోగొట్టుకున్న వారి ఫోన్లను నూతన టెక్నాలజీతో రికవరీ చేస్తున్నామన్నారు. మొత్తం రూ.20 లక్షల విలువైన సెల్‌ఫోన్లను రికవరీ చేశామన్నారు. ఎవరైనా ఫోన్లు పోగొట్టుకుంటే స్థానిక పోలీస్ స్టేషన్, సంబంధిత వెబ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలన్నారు. అలాగే వేసవి సెలవులకు ఊరెళ్లే వారు పోలీసులకు సమాచారం ఇస్తే రక్షణ కల్పిస్తామన్నారు. సమావేశంలో ఎస్సై పవన్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.


