బోల్తా పడిన ట్రాక్టర్‌ ట్రక్కు | - | Sakshi
Sakshi News home page

బోల్తా పడిన ట్రాక్టర్‌ ట్రక్కు

May 2 2026 7:32 AM | Updated on May 2 2026 7:32 AM

30 మంది కూలీలకు గాయాలు

మిర్చి కోతలకు వెళ్లి వస్తుండగా ఘటన

ఎటపాక: తెల్లవారు జామున మిర్చి కోతలకు వచ్చారు.. మధ్యాహ్నం మండుటెండలో పనులు ముగించుకుని ఇళ్లకు పయనమయ్యారు. ఇంతలో అనుకోని ప్రమాదంలో చిక్కుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. శుక్రవారం కృష్ణవరం, అచ్యుతాపురం, భూపతిరావుపేట గ్రామాల నుంచి కూలీలు ట్రాక్టర్‌లో గన్నవరం గ్రామానికి వచ్చారు. ఇక్కడ మిర్చి కోతల పనులు ముగించుకుని అదే ట్రాక్టర్‌లో వారి ఇళ్లకు తిరిగి వెళ్తుండగా కృష్ణవరం గ్రామ సమీపంలోని మూలమలుపు వద్ద ట్రాక్టర్‌ అదుపు తప్పింది. దీంతె కూలీలున్న ట్రక్కు ఇంజిన్‌ నుంచి విడిపోయి రహదారి పక్కకు పడిపోయింది. ట్రక్కులోని కూలీలంతా చెల్లాచెదురుగా ఒకరిపై ఒకరు పడిపోయారు. ఈ ప్రమాదాన్ని స్థానికులు గమనించి క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని గౌరిదేవిపేట పీహెచ్‌సీకి ట్రాక్టర్‌లో తరలించారు. గాయపడిన 30 మంది కూలీలకు డాక్టర్‌ శ్రీదేవి ఆధ్వర్యంలో ఆసుపత్రి సిబ్బంది ప్రథమ చికిత్స అందించారు. తీవ్ర గాయాలైన చిచ్చడి అనూష, సరియం సిసింద్రి, కారం లక్ష్మి, పెనుబల్లి రమ్య, సోయం జయమ్మ, సోయం తులసిలను 108 అంబులెన్స్‌లో భద్రాచలంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. తర్వాత మిగిలిన బాధితులను కూడా ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. బాధితులను డిప్యూటీ డీఎంహెచ్‌ఓ దుర్గాప్రసాద్‌ పరామర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement