నీచ రాతలపై ధర్నాగ్రహం | - | Sakshi
Sakshi News home page

నీచ రాతలపై ధర్నాగ్రహం

Apr 9 2026 8:05 AM | Updated on Apr 9 2026 8:05 AM

సాక్షి, రాజమహేంద్రవరం: మహిళలను దేవతలుగా పూజించే దేశంలో మహిళలపై నీచమైన వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ మహిళలకు తక్షణం క్షమాపణ చెప్పాలని వైఎస్సార్‌ సీపీ శ్రేణులు డిమాండ్‌ చేశాయి. మహిళలపై రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలకు నిరసగా వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలు స్థానిక కంబాల చెరువు సెంటర్‌ వద్ద ఉన్న ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద బుధవారం నిరసన చేపట్టారు. ఆంధ్రజ్యోతి డౌన్‌డౌన్‌, రాధాకృష్ణ డౌన్‌డౌన్‌ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

వారూ భాగస్వాములైనట్టే..

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, మహిళలపై అసభ్యంగా మాట్లాడితే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేష్‌ ఖండించకపోగా మద్దతు పలకడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. దీనినిబట్టి ఆ చెత్త పలుకు రాసింది రాధాకృష్ణే అయినా అందులో వారూ భాగస్వాములైనట్టేనని అన్నారు. బురద రాతలు రాసిన రాధాకృష్ణ.. నిరసన తెలిపేందుకు వైఎస్సార్‌ సీపీ నాయకులు రాగానే బాత్‌రూములో దాక్కోవడం ప్రజలందరూ చూశారన్నారు.

మహిళల జోలికొస్తే ఊరుకోం

పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ మాట్లాడుతూ, పత్రికా రంగంలో రాధాకృష్ణ అంత దుర్మార్గుడెవరూ ఉండరని విమర్శించారు. ఆయన తీరు పత్రికా రంగానికే కళంకమన్నారు. మీడియా ముసుగులో రాధాకృష్ణ కొత్త పలుకు కాదు చెత్త పలుకు రాస్తున్నారని, ఆయన మహిళలను కించపరిచిన పచ్చ మీడియా విలన్‌ అని అన్నారు. హైదరాబాద్‌లోని ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట వేలాది మంది వైఎస్సార్‌ సీపీ శ్రేణులు ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే రాధాకృష్ణ సిగ్గుపడాలన్నారు. చంద్రబాబు, లోకేష్‌కు డప్పు కొట్టుకున్నా అభ్యంతరం లేదని, వైఎస్సార్‌ సీపీ నేతలు, మహిళల జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. పత్రికా స్వేచ్ఛ ముసుగులో అనుచితమైన, దుర్మార్గమైన చెత్త రాతలు రాయడం మహిళల మనోభావాలను కించపరచడమేనని మండిపడ్డారు.

ఖబడ్దార్‌

వైఎస్సార్‌ సీపీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ, ఆడవాళ్ల గురించి నీచంగా మాట్లాడితే ఏబీఎన్‌ రాధాకృష్ణ, చంద్రబాబు, లోకేష్‌ ఎవరైనా సరే ఖబడ్దార్‌.. నాలుకలు తెగ్గోస్తామని హెచ్చరించారు. దళిత మహిళ హోం మంత్రిగా ఉన్నా రాష్ట్రంలో దళిత మహిళలకు రక్షణ కరువైందని విమర్శించారు. భార్యను చెల్లిగా భావించి మళ్లీ పెళ్లి చేయాలంటూ రాధాకృష్ణ చేసిన నీచమైన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని ఆవేదన చెందారు. అంతకు ముందు ఆమె స్థానిక ప్రకాష్‌ నగర్‌లోని నివాసం నుంచి వందలాది మంది, నాయకులు, కార్యకర్తలతో ర్యాలీగా కంబాలచెరువు సెంటర్‌కు చేరుకున్నారు.

పిచ్చి రాతలు మానుకోవాలి

మాజీ ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి, హౌసింగ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిలారెడ్డి మాట్లాడుతూ, మహిళలను, వైఎస్సార్‌ సీపీ శ్రేణులను కించపరుస్తూ ఎల్లో మీడియాలో పిచ్చి రాతలు రాస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం జర్నలిజానికి కళంకం తేవడమేనని అన్నారు. ఇలాంటి చర్యలు మానుకోవాలని హితవు పలికారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు, పవన్‌, లోకేష్‌ స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. రాధాకృష్ణది జర్నలిజం కాదు.. ముమ్మాటికీ బ్రోకరిజమేనని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ వైఎస్సార్‌ సీపీపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.

అడుగుడుగునా అడ్డంకులు

శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న వైఎస్సార్‌ సీపీ శ్రేణులకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద వందలాదిగా పోలీసు బలగాలు మోహరించాయి. వైఎస్సార్‌ సీపీ శ్రేణులు నిరసనలో పాల్గొనకుండా హౌస్‌ అరెస్టులు చేశారు. రాష్ట్రంలో అనేక సమస్యలున్నా.. ఇంకో పని లేదన్నట్టు డీఎస్పీ స్థాయి నుంచి ఎస్సైల వరకూ పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించడమేమిటని వైఎస్సార్‌ సీపీ శ్రేణులు నిలదీశాయి. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు గిరిజాల బాబు, గొందేసి శ్రీనివాస్‌రెడ్డి, నక్కా రాజబాబు, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు సాలి వేణు, వక్ఫ్‌బోర్డ్‌ మాజీ చైర్మన్‌ ఆరిఫ్‌, పోలు విజయలక్ష్మి, అడపా అనిల్‌, గుర్రం గౌతమ్‌, వాసంశెట్టి గంగాధరరావు తదితరులు పాల్గొన్నారు.

ఫ ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీపై

వైఎస్సార్‌ సీపీ శ్రేణుల ఆగ్రహం

ఫ ఆ పత్రిక కార్యాలయం వద్ద నిరసన

ఫ మహిళలకు తక్షణం

క్షమాపణ చెప్పాలని డిమాండ్‌

ఫ పత్రికా రంగానికి

రాధాకృష్ణ కళంకమని ధ్వజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement