రోజు కూలీల ప్రాణాలతో వాహన డ్రైవర్ల చెలగాటానికి అంతులేకుండా ఉంది. రోజు కూలీల జీవన పోరాటం.. వాహన డ్రైవర్ల అత్యాశ వెరసి ఈ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఎవరి అవసరాల మేరకు వారు మ్యాజిక్ వ్యాన్లు, ఆటోలను ఆశ్రయిస్తూ లోపల స్థలం లేకుంటే వెనుక భాగంలో నిలబడి మరీ పని ప్రదేశాలకు ప్రయాణిస్తున్నారు. డివిజన్‌లోని చింతూరు, కూనవరం, వీఆర్ పురం, ఎటపాక మండలాల్లో ఈ తరహా ఫుట్ పాత్ ప్రయాణాలు సహజమైపోయాయి. ఏదైనా ప్రమాదం జరిగినపుడు హడావిడి చేయడం తప్ప కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో అధికారులు తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారు.
చింతూరు


