అమలాపురం టౌన్: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు నాగార్జున యూనివర్శిటీ క్రీడా మైదానంలో సోమ, మంగళవారాల్లో జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో అమలాపురానికి చెందిన వెటరన్ క్రీడాకారిణి మెహబూబ్ షకీలా ప్రతిభ చాటింది. 35, 45 వయస్సు విభాగాల్లో ఈ అథ్లెటిక్స్ ఈవెంట్స్ జరిగాయి. హై జంప్‌లో మెహబూబ్ షకీలా బంగారు పతకాన్ని కై వసం చేసుకుంది. పట్టణానికి చెందిన బూరగాయల శివరామకృష్ణ కూడా డిస్కస్ త్రో క్రీడలో తలపడ్డారు. జిల్లాకు చెందిన దాట్ల ఎన్‌ఎస్ రామరాజు 800 మీటర్లు, 1500 మీటర్లు పరుగు పందెంలో వెండి పతకాలను, జావెలిన్ త్రోలో ఎం.సాయిబాబు కాంస్య పతకాన్ని, 100 మీటర్ల పరుగు పందెంలో ఐ.సురేష్‌కుమార్ కాంస్య పతాకాన్ని సాధించారు.


