● ఓవర్‌హెడ్ ట్యాంకు ప్రారంభోత్సవ ఫలకం
● నిర్మాణాన్ని పడగొట్టిన దుండగులు
● ఇమ్మిడివరప్పాడులో ఘటన
అమలాపురం రూరల్: మండలం ఇమ్మిడివరప్పాడులో తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన మరువక ముందే మరో శిలా ఫలకాన్ని ధ్వంసం చేశారు. అదే ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన శిలా ఫలకాన్ని ఈసారి ధ్వంసం చేశారు. ఇక్కడ వరసగా శిలా ఫలకాల ధ్వంసం జరుగుతున్న తీరు చూస్తుంటే గ్రామంలో రాజకీయ క్షక్షలతో కావాలనే ఇలా చేస్తునట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే, మంత్రులు, ప్రజా ప్రతినిధుల పేర్లతో ఉన్న శిలాఫలకం ధ్వంసం చేయడంతో సదరు ప్రజా ప్రతినిధులంటే ఇష్టం లేకనే ఇలా చేస్తున్నారని గ్రామస్తులు అరోపిస్తున్నారు. ఈ శిలాఫలకం ధ్వంసంపై పంచాయతీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల్లో రెండు శిలా ఫలాకాలు ధ్వంసం చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.


