లక్ష్మణ, హనుమత్ సమేతంగా సీతారాములు
ఈస్ట్ ఇండియా కంపెనీ
రాజ ముద్రిక
రాజమహేంద్రవరం రూరల్: బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మనల్ని పాలించే కాలంలో మెజారిటీగా ఉన్న హిందువుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని 1818వ సంవత్సరంలో అంటే ఇప్పటికి 208 సంవత్సరాల క్రితం శ్రీరామ నవమిని పురస్కరించుకొని సీతారాములు లక్ష్మణ హనుమత్ సమేతంగా ఉన్న చిత్రాన్ని ఒకవైపు, ఈస్ట్ ఇండియా కంపెనీ రాజ ముద్రికను రెండవ వైపు ముద్రించారు. అణా విలువతో నాలుగు సెంటీమీటర్ల వ్యాసార్థంతో మందంగా ఈ రాగి నాణేన్ని తీర్చిదిద్దారు. నాణేల సేకరణలో భాగంగా తమిళనాడులో 20 సంవత్సరాల క్రితం దీన్ని సేకరించినట్టు బొమ్మూరుకు చెందిన సామాజిక వేత్త అద్దంకి రాజా యోనా తెలిపారు.


