అడ్డు తొలగించుకోవడానికే హత్య | - | Sakshi
Sakshi News home page

అడ్డు తొలగించుకోవడానికే హత్య

Mar 3 2026 8:13 AM | Updated on Mar 3 2026 8:13 AM

ప్రియుడితో కలసి భర్తను హతమార్చిన భార్య

అనపర్తిలో ఆసుపత్రి వద్ద నిందితుల అరెస్ట్‌

రంగంపేట: వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య తన ప్రియుడితో కలసి భర్తనే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. గత నెల 27న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన చిక్కుముడిని పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించిన వివరాలను రాజమహేంద్రవరం ఈస్ట్‌ జోన్‌ డీఎస్పీ బి.విద్య సోమవారం రంగంపేట పోలీస్‌ స్టేషన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఆమె కథనం ప్రకారం.. రంగంపేట మండలం పెద్ద దొడ్డిగుంట గ్రామానికి చెందిన బక్క నాగేంద్రకు ఎనిమిదేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన బక్క వీరలక్ష్మితో వివాహం జరిగింది. ఆ దంపతులకు ఓ పాప ఉంది. గత కొద్దికాలంగా రంగంపేట మండలం నల్లమిల్లి గ్రామానికి చెందిన తోరాటి శివతో నాగేంద్ర భార్య వీరలక్ష్మి వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఇందులో భాగంగా గత నెల 27న రాత్రి ప్రియుడు శివతో కలసి వీరలక్ష్మి తమ పుట్టింట్లో ఉంది. దీనిని గమనించిన భర్త నాగేంద్ర వారిని నిలదీశాడు. వారిద్దరూ ఆగ్రహానికి గురయ్యి నాగేంద్రపై కత్తితో దాడి చేసి హతమార్చారు. అనంతర తోరాటి శివ పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా, బంధువులు అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్న శివ, వీరలక్ష్మితో కలసి ఆదివారం పరారు కావడానికి ప్రయత్నించగా, పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌ విధించినట్లు డీఎస్పీ వివరించారు. సమావేశంలో అనపర్తి సీఐ వీఎల్‌వీకే సుమంత్‌, రంగంపేట ఎస్సై ఎస్‌.శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement