తండ్రి మందలించాడని విద్యార్థి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

తండ్రి మందలించాడని విద్యార్థి అదృశ్యం

Dec 9 2025 9:22 AM | Updated on Dec 9 2025 9:22 AM

తండ్ర

తండ్రి మందలించాడని విద్యార్థి అదృశ్యం

పిఠాపురం: సెల్‌ ఫోన్‌ ఎక్కువగా వాడుతున్నావంటూ తండ్రి మందలించడంతో ఓ విద్యార్థి అదృశ్యమైనట్లు గొల్లప్రోలు ఎస్సై ఎన్‌.రామకృష్ణ సోమవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. గొల్లప్రోలు మండలం చేబ్రోలు హరేరామనగర్‌కు చెందిన జాగు సత్యనారాయణ కుమారుడు ప్రదీప్‌ (17) అదే గ్రామంలో ఒక ప్రైవేట్‌ కాలేజీలో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే ఈ నెల 6న ఇంటి వద్ద సెల్‌ ఫోన్‌ చూస్తున్న కుమారుడిని తండ్రి చూసి ఎప్పుడూ సెల్‌ ఫోన్‌తోనే ఉంటే ఎలా అంటూ మందలించారు. దీంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రదీప్‌ రెండు రోజులైనా తిరిగి రాలేదు. అన్ని చోట్లా గాలించినా ఫలితం లేకపోవడంతో సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఆచూకీ ఎవరికై నా తెలిస్తే వెంటనే గొల్లప్రోలు పోలీసులు సెల్‌ నంబర్‌ 91548 75379కు సమాచారం ఇవ్వాలని ఎస్సై విజ్ఞప్తి చేశారు.

భోజన హాలు విస్తరించేందుకు చర్యలు

అన్నవరం: స్థానిక వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలోని అన్నదాన భవనంపై షెడ్డు నిర్మించడం సాధ్యం కావడం లేదని జిల్లా కలెక్టర్‌ షణ్మోహన్‌కు అన్నవరం దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు తెలిపారు. అయితే అన్నదానంలో ఎక్కువ మందికి భోజనం పెట్టేందుకు భోజన హాలును మరింత విస్తరించే ఏర్పాట్లు చేస్తామని వివరించారు. కాకినాడ కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను ఈఓ సోమవారం కలిశారు. గత శుక్రవారం జిల్లా కలెక్టర్‌ అన్నవరం దేవస్థానానికి విచ్చేసినప్పుడు అన్నదాన పథకం భవనంపై మరో షెడ్డు వేసి ఎక్కువ మందికి భోజనాలు పెట్టాలని ఆదేశించారు. అయితే దీనిపై సాధ్యాసాధ్యాలు పరిశీలించిన అనంతరం షెడ్డు వేయడం కుదరదని కలెక్టర్‌కు వివరించగా, ఆయన అంగీకరించారని అధికారులు తెలిపారు. కాగా, దేవస్థానంలో అవస రం ఉన్నచోట 20 టాయిలెట్స్‌ ఏర్పాటు చేయా లని కలెక్టర్‌ ఆదేశించారు. తమ వద్ద అసెంబుల్డ్‌ చేసుకునేందుకు వీలుగా తయారు చేసిన 20 టా యిలెట్స్‌ ఉన్నాయని, వాటిని పంపిస్తామని వాటి కి అయ్యే ఖర్చు చెల్లించాలని కలెక్టర్‌ తెలిపారు. దానికి దేవస్థానం అధికారులు అంగీకరించారు.

శబరిమలకు సైకిల్‌ యాత్ర

సామర్లకోట: కేరళ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన శబరిమలకు అయ్యప్ప మాలధారులు సోమవారం సైకిల్‌ యాత్రగా బయలు దేరారు. సామర్లకోట మండలం మాధవపట్నం నుంచి బొందల దుర్గాప్రసాద్‌, వాసంశెట్టి దుర్గాప్రసాద్‌, వాసంశెట్టి లోవబాబు, మేడిశెట్టి భరత్‌కుమార్‌లు సైకిళ్లపై శబరిమలకు పయనమయ్యారు. వీరికి గ్రామానికి చెందిన పిల్లి పురుషోత్తం స్వామి శుభాకాంక్షలు తెలిపి వీడ్కోలు పలికారు. సుమారు 1,300 కిలోమీటర్ల ఈ యాత్రలో రోజుకు 40 కిలోమీటర్ల చొప్పున ప్రయాణిస్తూ, జనవరి 8 నాటికి శబరిమల చేరుకుంటామని స్వాములు తెలిపారు.

కాపవరంలో చోరీ

రామచంద్రపురం రూరల్‌: మండలంలోని కాపవరం గ్రామంలో ఇంటి తాళాలు పగులగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్‌ సోమవారం విలేకరులకు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. కాపవరం గ్రామానికి చెందిన పిల్లి శ్రీనివాస్‌ ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలోని రూ.10 వేలు, అర కాసు బంగారు లక్ష్మీదేవి రూపులతో కూడిన నల్లపూసల దండ, 10 తులాల వెండి పట్టీలు చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదుపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

తండ్రి మందలించాడని విద్యార్థి అదృశ్యం 1
1/2

తండ్రి మందలించాడని విద్యార్థి అదృశ్యం

తండ్రి మందలించాడని విద్యార్థి అదృశ్యం 2
2/2

తండ్రి మందలించాడని విద్యార్థి అదృశ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement