బాణసంచి నింపాల్సిందే..! | - | Sakshi
Sakshi News home page

బాణసంచి నింపాల్సిందే..!

Oct 19 2025 6:43 AM | Updated on Oct 19 2025 6:43 AM

బాణసం

బాణసంచి నింపాల్సిందే..!

అందరి జీవితాల్లో ఆనందాల వెలుగులు

నింపేదే దీపావళి పండగ. కష్టసుఖాలతో సాగిపోతున్న జీవితానికి ఈ పర్వదినం

భవిష్యత్తుపై ఆశలు కల్పిస్తోంది. అలసిన బతుకులకు కాస్తంత ఊరటనిస్తోంది. అందరిలాగే పండగలూ, పర్వదినాల్లో ఆర్థికంగా నిలదొక్కుకోవాలని వ్యాపారులూ ఆశిస్తుంటారు. దీపావళికి కొద్ది రోజులు కష్టపడితే నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చని భావిస్తారు. అలా అనుకుని బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేసిన వ్యాపారులను కొందరు అధికారులు మామూళ్ల పేరుతో ఎడాపెడా దండుకుంటున్నారు. మళ్లీ బాణసంచా గిఫ్ట్‌లు వేరు. నిలకడ లేని మార్కెట్‌తో అసలే అంతంతమాత్రంగా సాగుతున్న వ్యాపారాలకు తోడు..

ఈ మామూళ్ల దందా వ్యాపార వర్గాలను నిరాశానిస్పృహలకు గురి చేస్తోంది.

సాక్షి, రాజమహేంద్రవరం: దీపావళి పండగ అధికారులకు కాసులు కురిపిస్తోందా..? బాణసంచా తాత్కాలిక షాపుల ఏర్పాటులో దందాకు తెరలేచిందా..? ఒక్కో షాపునకు ఒక్కో ధర నిర్ణయించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.

ఇదీ సంగతీ

దీపావళికి తాత్కాలిక ప్రాతిపదికన బాణసంచా దుకాణాల ఏర్పాటు చేసుకునేందుకు అధికారులు అనుమతులు ఇస్తారు. రెవెన్యూ, అగ్నిమాపక శాఖ, పోలీస్‌, జీఎస్టీ శాఖలు సమన్వయంతో తాత్కాలిక లైసెన్స్‌ మంజూరు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకు గాను వ్యాపారులు దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తులు చేసుకోవడం, ఆపై అనుమతులు ఇవ్వడం ప్రతి ఏటా జరుగుతోంది. ఇదే అదనుగా భావిస్తున్న అధికారులు అక్రమాలకు తెర తీస్తున్నారు. సందట్లో సడేమియా అన్న చందంగా రూ.లక్షలు దండుకుంటున్నారు. ఒక్కో షాపునకు ఒక్కో ధర నిర్ణయించి మరీ వసూళ్లకు తెగబడుతున్నట్టు తెలిసింది.

వసూలు చేయాల్సిందిలా..

బాణసంచా తాత్కాలిక దుకాణం ఏర్పాటు చేసుకోవాలంటే సదరు వ్యాపారి ప్రభుత్వ నిబంధనల మేరకు లైసెన్స్‌ నిమిత్తం అగ్నిమాపక శాఖకు రూ.500 చలానా, రెవెన్యూ శాఖకు రూ.500 చలానా, జీఎస్టీ శాఖకు రూ.5 వేల అడ్వాన్స్‌ చెల్లించాల్సి ఉంది. ఇలా ఓ దుకాణానికి రూ.6 వేలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అంతకు మించి దండుకుంటున్నారు.

రూ.40 వేల వరకు వసూలు:

బాణసంచా దుకాణాల లైసెన్స్‌ల మంజూరులో అంతులేని అక్రమాలు జరుగుతున్నాయి. అధికారులు అడ్డగోలు వ్యవహారానికి తెర తీస్తున్నారు. షాపునకు ఓ ధర పెట్టి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఒక్కో దుకాణానికి రూ.30 వేల నుంచి రూ.40 వేలు దండుకుంటున్నట్లు సమాచారం. ఇలా జిల్లా వ్యాప్తంగా సుమారు 400 దరఖాస్తులు అందాయి. ఇప్పటికే రాజమండ్రి రెవెన్యూ డివిజన్‌లో 257 దుకాణాలకు ఇప్పటికే అనుమతులు ఇచ్చారు. కొవ్వూరు డివిజన్‌లో సైతం వందకు పైగా దుకాణాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలిసింది. ఒక్కో షాపు నుంచి రూ.30 వేల చొప్పున లెక్కగట్టినా.. రూ.1.10 కోట్లు వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు ఒక్కో దుకాణానికి రూ.6 వేల చొప్పున రూ.21 లక్షలు ప్రభుత్వానికి వెళ్లగా.. మిగిలిన సుమారు రూ.90 లక్షలు అధికారుల జేబుల్లోకి చేరినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. మధ్యవర్తులను అడ్డుపెట్టుకుని లైసెన్స్‌ జారీ అయినట్టు సమాచారం.

కూటమి నేతల సిండికేట్‌..?

మద్యం షాపులే కాదు.. బాణసంచా దుకాణాల్లో సైతం కూటమి నేతలు సిండికేట్‌గా ఏర్పడినట్టు ఆరోపణలున్నాయి. తమ కనుసన్నల్లోనే లైసెన్స్‌ల మంజూరు ప్రక్రియ నిర్వహించినట్టు సమాచారం. అధికార పార్టీ నేతలు కావడంతో అధికారులు సైతం మిన్నకుండిపోయినట్టు తెలిసింది.

ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి

బాణసంచా విక్రయాల కోసం మున్సిపల్‌, రెవెన్యూ, అగ్నిమాపక, విద్యుత్‌, పోలీస్‌, జీఎస్టీ శాఖల అధికారులతో కూడిన కమిటీ నుంచి ముందస్తు అనుమతులు తప్పనిసరి. ఇక్కడే అసలు చేతివాటం మొదలవుతోంది. తాత్కాలిక విక్రయదారులకు డీలర్‌షిప్‌ ఉండదు. దీంతో వారికి అడ్వాన్స్‌డ్‌ లైసెన్స్‌లు జారీ చేస్తారు. దీని ప్రకారం తాము విక్రయించబోయే సరకు విలువపై 18 శాతం జీఎస్టీని ముందుగానే చెల్లించాలి. రూ.లక్ష విలువైన సరకు విక్రయిస్తే రూ.18 వేలు పన్నుగా చెల్లించాలి. వ్యాపారం ముగిశాక, అమ్మిన సరకు విలువ అంచనా కన్నా ఎక్కువైతే మిగిలిన పన్ను చెల్లించాలి. తక్కువైతే అదనంగా కట్టిన డబ్బును అధికారులు తిరిగి వెనక్కు ఇవ్వాలి. ఇక్కడ మాత్రం కొందరు వాణిజ్య పన్నుల విభాగం అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నట్టు సమాచారం. వ్యాపారులతో కుమ్మకై ్క ఎంత సరకై నా అమ్ముకో.. ప్రభుత్వానికి కొద్దిగా పన్ను కట్టి, తమకు కొంత సమర్పిస్తే చాలన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఈ తంతు కొవ్వూరు, రాజమండ్రి డివిజన్ల పరిధిలో ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. సర్కిళ్ల వారీగా వసూళ్లకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించినట్టు ఆరోపణలున్నాయి. ఇలా వసూలు చేసిన మొత్తాన్ని ఉన్నత స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు అధికారులు పంచుకుంటున్నట్టు విమర్శలున్నాయి.

అక్రమ తయారీపై చర్యలేవీ..?

బాణసంచా తయారీ కేంద్రాలపై అధికారుల పర్యవేక్షణ కరవైంది. మామూళ్లు దండుకుని కేంద్రాలకు లైసెన్స్‌లు రెన్యూవల్‌ లేకపోయినా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇందుకు ఇటీవల చాగల్లు మండలం చిక్కాలకు వెళ్లే రోడ్డు సమీపంలో అక్రమంగా బాణసంచా తయారు చేస్తున్న కేంద్రంపై పోలీసులు దాడులు చేశారు. పెద్దఎత్తున తయారీ సామగ్రిని పట్టుకున్నారు. కేవలం ఇక్కడ ఒక్కటే కాదు, జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు నడుస్తున్నా.. మిన్నకుండిపోవడం వెనుక ఆంతర్యం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రమాదాలు ఏమైనా జరిగితే రెండు రోజుల పాటు హడావుడి చేయడం.. అనంతరం మిన్నకుండిపోవడం పరిపాటిగా మారుతోంది. దీని వెనుక రూ.లక్షలు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలున్నాయి.

రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాలు

క్యాష్‌ కొట్టు... లైసెన్స్‌ పట్టు

మామూళ్లు ఇచ్చుకో.. లైసెన్స్‌ పట్టుకో..

దుకాణాల ఏర్పాటులో లంచావతారాలు

ఒక్కో షాపునకు ఒక్కో రేటు నిర్ణయం

రూ.30 వేల నుంచి రూ.40 వేల వసూళ్లు

అన్ని శాఖల అధికారులకూ వాటాలు!

జిల్లావ్యాప్తంగా 400కు పైగా షాపుల ఏర్పాటుకు దరఖాస్తులు

బాణసంచి నింపాల్సిందే..!1
1/1

బాణసంచి నింపాల్సిందే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement