
అక్రమ బాణసంచా తయారీ నిందితుల అరెస్ట్
చాగల్లు: అనుమతులు లేకుండా అక్రమంగా బాణసంచాను తయారు చేస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు రాజమహేంద్రవరం నార్త్ జోన్ ఏసీపీ, కొవ్వూరు ఇన్‌చార్జి డీఎస్పీ వై.శ్రీకాంత్ శుక్రవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. చాగల్లు శివారులోని మట్టా శివనారాయణ జీడిమామిడి తోటలో అక్రమంగా బాణసంచా తయారు చేస్తున్న ఊనగట్లకు చెందిన ఆత్కూరి గోపాలకృష్ణ, మట్టా శివనారాయణ, దొనక మురళి, పల్లెల రవికుమార్, కోకనాటి సూరిబాబులను అరెస్ట్ చేశామన్నారు. బాణసంచా తయారీ సామగ్రితోపాటు పాటు రెండు వ్యాన్‌లను స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడన్నారు. ఈ దాడుల్లో కొవ్వూరు రూరల్ సీఐ విజయ్‌బాబు, చాగల్లు ఎస్సై కె.నరేంద్ర, తహసీల్దార్ ఎం.మెరికమ్మ తదితరులు పాల్గొన్నారు.