
బైక్‌ను ఢీకొన్న ఆటో
ఒకరి మృతి, మరొకరికి గాయాలు
నల్లజర్ల: పోతవరం శివారులో శుక్రవారం ఉదయం ఓ బైక్‌ను ట్రక్కు ఆటో ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న బల్వేంద్రసింగ్ (28) అక్కడికక్కడే మృతి చెందగా, ఆటో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన బల్వేంద్రసింగ్ ఆరు నెలల క్రితం కొయ్యలగూడెం మండలం కనకాద్రిగూడెంలో మారుతి కోళ్లఫారంలో పనికి చేరాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శుక్రవారం సెలవు కావడంతో బైక్‌పై కూరగాయలు తేవడానికి పోతవరం వెళ్తుండగా నల్లజర్ల నుంచి కొయ్యలగూడెం వెళ్తున్న ట్రక్కు ఆటో ఢీకొంది. ఏఎస్‌ఐ శోభనాద్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.