
కోటసత్తెమ్మ వారికి రూ.36.11 లక్షల ఆదాయం
నిడదవోలు రూరల్: తిమ్మరాజుపాలెంలో వేంచేసియున్న కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయంలో హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించారు. ఆలయ హుండీలో రూ.34,61,125, అన్నదాన ట్రస్ట్ హుండీలో రూ.1,50,761 కలిపి మొత్తం రూ.36,11,886 నగదు, 16 గ్రాముల బంగారం, 245 గ్రాముల వెండి, 5 విదేశీ కరెన్సీ నోట్లు లభించాయని దేవదాయ శాఖఅసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈఓ వి.హరిసూర్యప్రకాష్ తెలిపారు. వంద రోజులకు గాను ఈ లెక్కింపు జరిగింది. దేవదాయ శాఖ జిల్లా అధికారి ఈవీ సుబ్బారావు పర్యవేక్షణలో ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది హుండీల నగదును లెక్కించారు. కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్, చైర్మన్ దేవులపల్లి రవిశంకర్, ప్రధానార్చకుడు అప్పారావుశర్మ తదితరులు పాల్గొన్నారు.
అన్నవరప్పాడు వెంకన్నకు
రూ.4.18 లక్షల రాబడి
పెరవలి: మండలంలోని అన్నవరప్పాడులో వేంచేసియున్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించారు. ప్రధాన హుండీతో పాటు ఉప ఆలయాల్లోని హుండీల ద్వారా రూ.4,09,326, అన్నదాన హుండీ ద్వారా రూ.8,831, కలిపి మొత్తం రూ.4,18,157 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ మీసాల రాధాకృష్ణ తెలిపారు. మొత్తం 50 రోజులకు గాను ఈ ఆదాయం వచ్చిందన్నారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ తనిఖీదారు జి.సత్యవర ప్రసాద్ సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

కోటసత్తెమ్మ వారికి రూ.36.11 లక్షల ఆదాయం