
పట్టాలు ఇచ్చారు..
భూమి చూపలేదు
బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగి ఏళ్లు గడుస్తున్నా బాధిత కుటుంబాలకు ఇచ్చిన పట్టాలకు నేటికీ భూమిని చూపించలేదు. అక్టోబర్ పదో తేదీ 2014లో వాకతిప్పలో ఉన్న బాణసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగి 18 మంది అక్కడకక్కడే మృతి చెందారు. వారిలో నా భార్య మసకపల్లి పుష్పావతి, మరదలు మసకపల్లి కుమారి ఉన్నారు. అప్పట్లో బాధిత కుటుంబాలకు టీడీపీ ప్రభుత్వం ఒక్కొక్కరికి 50 సెంట్లు భూమి ఇస్తానని బి పట్టాలు ఇచ్చింది. ఆ భూమి చూపించాలని తహసీల్దార్ కార్యాలయం, స్పందనకు కాళ్లు అరిగేలా తిరుగుతూ వచ్చాం. ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. ఈ పట్టాలకు సంబంధించిన భూమిని గతంలో వేరే వారికి ఇచ్చారు. వారి దగ్గర పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయి. మమ్మల్ని అప్పటి ప్రభుత్వం మోసం చేసింది. ఇప్పటికై నా ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఇస్తానన్న 50 సెంట్ల భూమిని ఇవ్వాలి.
– మసకపల్లి నాగేశ్వరరావు, వాగతిప్ప
ప్రభుత్వం ఆదుకోవాలి
నా తల్లి విజయలక్ష్మిని కోల్పోయాను. ఇంతకాలం మా కుటుంబాన్ని నెట్టుకుంటూ వచ్చింది. ఈ ప్రమాదంతో దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నాం. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు. ప్రభుత్వం సాయం అందించి ఆదుకుంటుందని ఆశగా ఎదురుచూస్తున్నాం.
– దుర్గాదేవి, సోమేశ్వరం, రాయవరం

పట్టాలు ఇచ్చారు..