
పెళ్లింట విషాదం
కాట్రేనికోన: పెళ్లింట విషాదం నెలకొంది.. రోడ్డు ప్రమాదంలో పెళ్లి కొడుకు చిన్నాన్న మృతితో అంతులేని శోకం మిగిలింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. శనివారం పల్లం గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు మల్లాడి భాగ్యరాజు (42) అన్నయ్య చిన ధర్మారావు కుమారుడి వివాహం సందర్భంగా పార్టీ నాయకులతో పాటు మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్ వెళ్లి ఆశీర్వదించారు. అనంతరం ముమ్మిడివరం మండలం అయినాపురం పెండ్లి కుమార్తె ఇంటికి పల్లం నుంచి మోటార్ సైకిల్‌పై మల్లాడి భాగ్యరాజుతో పాటు అర్థాని వెంకటేశ్వర్లు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. పల్లం – దొంతికుర్రు రోడ్డులో ఢాం సెంటరు సమీపంలో నీళ్లరేవు నుంచి కొబ్బరికాయల లోడుతో వస్తున్న ట్రాక్టర్ వెనుక నుంచి మోటార్ సైకిల్‌ను ఢీకొని భాగ్యరాజు మీదుగా వెళ్లిపోయింది. అనంతరం ట్రాక్టర్ పంట కాలువలో బోల్తా పడింది. దీంతో భాగ్యరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. మోటారు సైకిల్‌పై ఉన్న అర్థాని వెంకటేశ్వర్లుకు బలమైన గాయాలు కాగా, ట్రాక్టర్ డ్రైవర్‌కు క్షేమంగా ఉన్నాడు. పెళ్లింట విషాదం నెలకొనడంతో వివాహం నిలిచిపోయింది. మృతుడు భాగ్యరాజుకు భార్య సత్యవతి, ఇద్దరు అబ్బాయిలు, అమ్మాయి ఉన్నారు. సాయంత్రం పెళ్లి జరుగుతుందనే సంతోషంలో ఉన్న కుటుంబంలో ఈ ఘటన అంతులేని విషాదాన్ని నింపింది. ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రిలో భాగ్యరాజు మృతదేహానికి శవ పంచనామా నిర్వహించారు. ఆసుపత్రిలో భాగ్యరాజు భౌతికకాయం వద్ద మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్, పాలెపు ధర్మారావు, మల్లాడి బాబ్జి, కోలాటి సత్యం తదితరులు అంజలి ఘటించారు.
ఫ బైక్‌ను ఢీకొన్న ట్రాక్టర్
ఫ ఒకరి దుర్మరణం

పెళ్లింట విషాదం

పెళ్లింట విషాదం