
షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక
ఎంపికై న బాలురు
రాష్ట్ర స్థాయి అండర్–19 షటిల్ బాడ్మింటన్ పోటీలకు ఎంపికై న బాలికలు
పెదపూడి: క్రీడలతో విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని జి.మామిడాడ జీఆర్‌ఎస్‌ఏ ఫ్యామిలీ హెల్త్ క్లబ్ అధ్యక్షుడు ద్వారంపూడి భాస్కరరెడ్డి, లయన్స్ క్లబ్ అడ్మిన్ మండ రాజారెడ్డి అన్నారు. జి.మామిడాడలోని జీఆర్‌ఎస్‌ఏ ఫ్యామిలీ హెల్త్ క్లబ్ ద్వారంపూడి దివాకర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అండర్–19 బాలుర, బాలికల విభాగాల్లో షటిల్ బ్యాడ్మింటన్ క్రీడా జట్ల ఎంపికలు సోమవారం జరిగాయి. ముఖ్య అతిథులుగా ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి, మండ రాజారెడ్డి హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పడాల గంగాధర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ఎంపికలు స్థానిక లయన్స్ క్లబ్, జీఆర్‌ఎస్‌ఏ ఫ్యామిలీ హెల్త్ క్లబ్ సహకారంతో నిర్వహించామన్నారు. ఎంపికై న క్రీడాకారులు త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి అండర్–19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జట్టు తరఫున పాల్గొంటారన్నారు. షటిల్ బ్యాడ్మింటన్ సెలక్షన్ కమిటీ సభ్యులు టీఎన్‌వీఆర్ మూర్తి, ఫిజికల్ డైరెక్టర్లు ద్వారంపూడి యువరాజారెడ్డి, నల్లమిల్లి అప్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక