
● దారిదాపుల్లోకి వెళ్లలేం
అక్కడక్కడా రోడ్డు... అన్నీ గుంతలే అన్నట్లు ఉంది.. ఇది తలుపులమ్మ అమ్మవారి లోవ దేస్థానానికి వెళ్లే ప్రధాన రహదారి పరిస్థితి. నిత్యం ఇటుగా వెళ్లే భక్తులు, ప్రయాణికులకు నరకం కనిపిస్తోంది. జూన్‌లో తలుపులమ్మ తల్లి ఆషాఢ మాసోత్సవాలకు వేలాది మంది భక్తులు వస్తారని భావించిన అధికారులు తాత్కాలికంగా కంకర బూడిదతో గుంతలను పూడ్చారు. ఇది నెల రోజులకే యథాస్థితికి చేరింది. అప్పటి నుంచి చినుకు పడితే గుంతల్లో నీరు నిలిచిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. లోవదేవస్థానికి, లోవకొత్తూరు, కొత్త వెలంపేట, సీతయ్యపేట, తుని పట్టణ వాసులకు నాలుగు వేల ఇళ్లు నిర్మిస్తున్న జగనన్న కాలనీకి, రౌతులపూడి మండలం ధార జగన్నాథపురం, మరికొన్ని గ్రామాలకు ఇదే ప్రధాన రహదారి. జాతీయ రహదారి నుంచి ఆరేడు కిలోమీటర్ల పరిధిలో ఈ రోడ్డు పరిస్థితి అధ్వానంగా ఉందని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు వాపోతున్నారు.
– తుని రూరల్