
రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి
రాజోలు: స్నేహితుడిని కలిసేందుకు మోటార్ సైకిల్‌పై బయలుదేరిన పశ్చిమగోదావరి జిల్లా కలగంపూడికి చెందిన బీటెక్ విద్యార్థి కడలి అక్షయ్(22) రాజోలు మండలం ములికిపల్లి–కడలి రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అక్షయ్ తండ్రి కడలి మోహనరావు ఫిర్యాదు మేరకు రాజోలు ఎస్సై రాజేష్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కలగంపూడి గ్రామానికి చెందిన అక్షయ్ చైన్నెలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. దసరా సెలవులు పురస్కరించుకుని ఈ నెల 27వ తేదీ రాత్రి కలగంపూడి వచ్చాడు. మర్నాడు ఉదయమే తన స్నేహితుడిని కలిసేందుకు బుల్లెట్ మోటార్ సైకిల్‌పై ములికిపల్లి రాగా లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చైన్నె నుంచి ఇంటికి వచ్చి తమతో గడపకుండానే కుమారుడు మృతి చెందడం పట్ల తండ్రి మోహనరావు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి