
ఇద్దరు భవానీ మాలధారుల దుర్మరణం
● మరొకరికి తీవ్ర గాయాలు
● వెనుక నుంచి ఢీకొట్టిన కారు
నల్లజర్ల: జాతీయ రహదారిపై నల్లజర్ల మండలం పుల్లలపాడు వద్ద ఆదివారం ఉదయం కాలినడకన విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్తున్న భవానీ మాలధారులను వెనుక నుంచి కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం దోశలపాడు గ్రామానికి చెందిన పక్కురి శివ, పక్కుర్తి శ్రీను, పక్కురి శేశీలు, కోనాగోవిందు భవానీ మాలలు ధరించి ఈ నెల 24న తమ స్వగ్రామం నుంచి ఇరుముళ్లు కట్టుకొని విజయవాడలోని దుర్గమ్మ సన్నిధికి పాదయాత్రగా బయలు దేరారు. వీరంతా ఆదివారం ఉదయం పుల్లలపాడు జాతీయ రహదారిపైకి వచ్చేసరికి విశాఖపట్టణం నుంచి హైదరాబాదు వెళ్తున్న పశ్చిమబెంగాల్‌కు చెందిన కారు వీరిని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ సంఘటనలో శివ చక్రాల కింద, గాలిలోకి ఎగిరి పక్కనే పంటబోదెలోకి పడిన శ్రీను అక్కడికక్కడే మృతి చెందగా శేశీలుకు రెండు కాళ్లూ విరిగిపోయాయి. ఆయనను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గోవిందు ఫోన్ మాట్లాడుతూ దూరంగా ఉండటంతో క్షేమంగా బయటపడ్డాడు. మృతిచెందిన శివకు భార్యదేవి, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. శ్రీను అవివాహితుడు కాగా వీరంతా వ్యవసాయ కూలీలే. మృతదేహాలను కోసం తాడేపల్లిగూడెం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ దుర్గాప్రసాద్ తెలిపారు.

ఇద్దరు భవానీ మాలధారుల దుర్మరణం

ఇద్దరు భవానీ మాలధారుల దుర్మరణం