
ఆందోళనకరంగా గుండెపోటు
గుండె రక్తనాళాలు మూసుకుపోయి రక్తం సరఫరా తగ్గిపోవడం వల్లనే ఛాతిలో నొప్పి వస్తుంది. ఛాతిలో బరువుగా అనిపించడం, మెడ భాగం నుంచి మొదలై, ఎడమ చేతి వరకు లాగడం, నొప్పి వీపు వెనక భాగంలో రావడం, ఆయాసం, కళ్లు తిరగడం, చెమటలు పట్టడం, కడుపులో మంట రావడం జరుగుతాయి. ఈ లక్షణాలు ఉండే వెంటనే వైద్యుడిని సంప్రదిస్తే ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
– డాక్టర్ కారెం రవితేజ, ఎండీ ఫిజీషియన్, ఏరియా ఆస్పత్రి, అమలాపురం
ప్రతి రోజూ వ్యాయామం చేయాలి
ఫాస్ట్‌ఫుడ్, జంక్‌ఫుడ్స్ అధికంగా తినడం, వ్యాయామం లేకపోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. తెలియకుండానే శరీరంలో కొలెస్ట్రాల్ అధిక స్థాయిలో పెరిగి, రక్తంలో బ్లాక్స్ ఏర్పడతాయి. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండె, మెదడు స్ట్రోక్స్ వస్తాయి.
– డాక్టర్ సుమలత, డిస్ట్రిక్ట్ నోడల్ అధికారి, ఎన్‌సీడీ, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
●

ఆందోళనకరంగా గుండెపోటు