
హడలెత్తిస్తున్న ధార్‌గ్యాంగ్
రాజమహేంద్రవరం రూరల్: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు షాపులో ఒక గోల్డుషాపులో దుండగులు ఈ నెల 23వ తేదీన షట్టర్ పైకి వంచి అద్దాలు పగలు గొట్టి 11 కిలోల వెండి దొంగతనం చేశారు.
● తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల జంక్షన్ వెనుక ఒంటరిగా నివసిస్తున్న పాకలపాటి సుభద్ర ఇంట్లోకి ఈ నెల 24వ తేదీ రాత్రి నలుగురు దుండగులు వెళ్లి రాళ్లతో ఆమైపె దాడి చేసి 15 కాసుల బంగారం అపహరించుకు పోయారు.
● అంతకు ముందు నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సైతం ఈ తరహా చోరీలకు పాల్పడ్డారని సమాచారం.
రంగంలోకి దిగిన పోలీసులు ఈ చోరీలకు పాల్పడుతన్న వ్యక్తులు మధ్యప్రదేశ్‌కు చెందిన ధార్‌గ్యాంగ్‌గా గుర్తించారు. చోరీలకు పాల్పడిన ప్రదేశాలలో ఒకరి వేలిముద్రలు మధ్యప్రదేశ్‌కు చెందిన నేరస్తుడి వేలిముద్రలతో సరిపోవడంతో పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ధార్‌గ్యాంగ్ ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు తేల్చారు.
తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్
ధార్‌గ్యాంగ్‌లో నలుగురి నుంచి ఆరుగురు వరకు సభ్యులు ఉంటారన్నారు. వీరికి రాత్రి సమయాల్లో ఒంటరిగా వెళుతున్న మహిళలు, శివారు ప్రాంతాలతో పాటు, తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్. ఉదయం సమయంలో ఆటోల్లో రెక్కీ నిర్వహిస్తుంటారు. రాత్రి సమయాల్లో నలుగురు నుంచి ఆరుగురు వెళ్లి చోరీలకు పాల్పడతారు. ఒకవేళ ఇంటిలో ఎవరైనా ఉంటే వారిపై విచక్షణా రహితంగా దాడులు చేసి సొత్తును చోరీ చేస్తుంటారు.
అవగాహన కల్పిస్తున్న జిల్లా పోలీసులు
పోలీసు అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఆయా పోలీస్ స్షేషన్‌ల పరిధిలో ఇన్‌స్పెక్టర్లు,ఎస్సైలు శివారు ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రాత్రి వేళల్లో ప్రజలు ఒంటరిగా తిరగవద్దని, ముఖ్యంగా అర్ధరాత్రుళ్లు ఎవరైనా తలుపు తడితే తీయవద్దని, వచ్చిన వారు ఎవరో నిర్ధారించుకోవాలన్నారు. దోపిడీలకు, దాడులకు పాల్పడే మధ్యప్రదేశ్‌కి చెందిన ధార్ గ్యాంగ్ తూర్పు గోదావరి జిల్లా పరిసర ప్రాంతాల్లో తిరుగుతోందని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ధార్ గ్యాంగ్ గ్రామాల శివారు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు వెల్లడించారు. రాత్రి సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
క్రైమ్ పోలీసుల హెచ్చరిక
అమలాపురం టౌన్: మధ్యప్రదేశ్‌కు చెందిన ధార్ గ్యాంగ్ ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇంటి దొంగతనాలు, ఇతర నేరాలకు పాల్పడుతున్న క్రమంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోనసీమ జిల్లా క్రైమ్ పోలీస్ స్టేషన్ ఆదివారం హెచ్చరించింది. ధార్‌గ్యాంగ్‌తోపాటు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన గ్యాంగ్‌లు కూడా రాష్ట్రంలోకి వచ్చినట్టు సమాచారం ఉందని పేర్కొంది. ఈ గ్యాంగ్ ఒంటరిగా ఉన్న మహిళలను, ఇళ్లను టార్గెట్ చేస్తుందని క్రైమ్ పోలీస్ స్టేషన్ సీఐ గజేంద్రకుమార్ తెలిపారు. ధార్‌గ్యాంగ్‌లోని ఎనిమిది మంది ఫొటోలను పోలీసులు విడుదల చేశారు.
ఒంటరి మహిళలు, తాళాలు వేసిన ఇళ్లు, శివారుప్రాంతాలే టార్గెట్
నల్లజర్ల, ప్రత్తిపాడుతో పాటు
పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన వైనం
ప్రజలను అప్రమత్తం చేస్తున్న పోలీసులు

హడలెత్తిస్తున్న ధార్‌గ్యాంగ్