
పాడైన పంటల పరిశీలన
పెరవలి: జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు, గోదావరికి వరదల వల్ల లంక భూముల్లోని కూరగాయల పంటలు దెబ్బతినటం వాస్తమేనని అందుకే కూరగాయల ధరలు పెరిగాయని అధికారులు అన్నారు. సాక్షి దినపత్రిలో కూరగాయాలు అంటూ సోమవారం కథనం వచ్చిన నేపథ్యంలో ఉద్యాన అధికారులు క్షేత్ర స్థాయి పర్యటన చేశారు. వారు ఖండవల్లి, కాకరపర్రు, ముక్కామల గ్రామాల్లో నష్ట పోయిన పంటల వివరాలు రైతుల నుంచి సేకరించారు. కొవ్వూరు ఉద్యాన అధికారి డి సుధీర్‌కుమార్ మాట్లాడుతూ గోదావరికి వరదల వలన లంకల్లో ఉండే సి క్లాస్ భూముల్లో కూరగాయల పంటలు నీటమునిగి పాడైపోయాయని, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయని, అందుకే కూరగాయల ధరలు పెరిగాయన్నారు. రైతులు సంఘటితంగా ముందుకు వస్తే మార్కెటింగ్ శాఖ సహకారంతో రైతుబజార్లు ఏర్పాటు చేస్తామని, కూరగాయలు నిల్వ ఉంచేందుకు శీతల గిడ్డంగులు నిర్మిస్తామని అన్నారు.
పీజీఆర్‌ఎస్‌లో
152 అర్జీల స్వీకరణ
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ భవనంలో సోమవారం ఇతర అధికారులతో కలిసి జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామమూర్తి ప్రజల నుంచి 152 అర్జీలను స్వీకరించారు. ప్రజలు తమ అర్జీలను పలు మార్గాల్లో అందించవచ్చన్నారు. 1100 కాల్ సెంటర్ ద్వారా, వాట్సాప్ గవర్నెన్స్‌కు 95523 00009 ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
హౌసింగ్ పీడీగా బుజ్జి
బాధ్యతల స్వీకరణ
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): తూర్పుగోదావరి జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా నాతి బుజ్జి సోమవారం కలెక్టరేట్‌లో బాధ్యతలు స్వీకరించారు. గండేపల్లి మండల ఎంపీడీవోగా, అనంతరం ఏలూరు జిల్లా నీటి యాజమాన్య సంస్థలో డీఎల్డీఓగా పదోన్నతి పొందిన బుజ్జి సోమవారం తూర్పు గోదావరి జిల్లాలో హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా కేఆర్‌సీ (కోనేరు రంగారావు కమిటీ) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కే భాస్కర్‌రెడ్డి బాధ్యతలు నిర్వహించారు.

పాడైన పంటల పరిశీలన

పాడైన పంటల పరిశీలన

పాడైన పంటల పరిశీలన