గొడ్డు చాకిరీలు.. గొర్రె తోక జీతాలు! | - | Sakshi
Sakshi News home page

గొడ్డు చాకిరీలు.. గొర్రె తోక జీతాలు!

Sep 16 2025 7:39 AM | Updated on Sep 16 2025 7:39 AM

 గొడ్

గొడ్డు చాకిరీలు.. గొర్రె తోక జీతాలు!

జిల్లాలో అక్టోబర్‌ 1 నుంచి

సచివాలయ ఉద్యోగుల ఉద్యమబాట

పనిభారం తగ్గించాలని డిమాండ్‌

ప్రభుత్వ ఉద్యోగులుగా గౌరవించండి

వలంటీర్ల విధులు మాకొద్దు

ఇది వరకే నోటీసులు జారీ

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): తమపై మోపిన విధుల భారం తగ్గించి, న్యాయమైన డిమాండ్లను నెరవేర్చని పక్షంలో ఉద్యమబాట పట్టేందుకు జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి, స్థానిక అధికారులకు ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు వినతి పత్రాలను అందజేశారు. న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విన్నవించారు. ఆక్టోబర్‌ ఒకటి నుంచి నిరవధిక సమ్మె చేపట్టాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు నిర్ణయించారు. తూర్పుగోదావరి జిల్లాలో 512 గ్రామ, వార్డు సచివాలయాలు నడుస్తుండగా వాటిలో 3,988 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.

అన్ని భారాలు భరిస్తూ...

కూటమి ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను అచేతనావస్థలో ఉంచడంతో సచివాలయ ఉద్యోగులపై అధిక భారం, ఒత్తిడి పెరిగిపోయింది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ విధుల్లో ఉండి ప్రభుత్వం నిర్ధేశించిన సర్వేలు, కార్యక్రమాలను అమలు చేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వలంటీర్లు నిర్వహించిన పనులు కూడా సచివాలయ ఉద్యోగులే చేయాల్సి వస్తోంది. దీంతో ప్రజలకు చెందిన సామాజిక, ఆర్థిక, విద్య, వైద్యం, ఆధార్‌ బయోమెట్రిక్‌ వివరాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాల సేకరణతో భారం అధికమైంది. ఉద్యోగులు తమ శాఖకు చెందిన పనులనే కాకుండా శాఖకు సంబంధం లేని పనులను కూడా చూడాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఉద్యోగులకు పని భారం తగ్గించాలని కోరడమే కాకుండా తమ డిమాండ్లను సంఘాలు ప్రభుత్వం ముందుంచాయి. వీటి సాధనే లక్ష్యంగా ఉద్యమించేందుకు కార్యాచరణ ప్రకటించా యి. సచివాలయ ఉద్యోగ జేఏసీ సంఘ ప్రతినిధులు వారం రోజులుగా సమ్మె నోటీసులను మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీఓలకు ఇస్తున్నారు. ఈ నెల 30లోపు సమస్యలను పరిష్కరించకుంటే ఆక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

ఇవీ డిమాండ్లు...

● ఆరేళ్లు ఒకే క్యాడర్‌లో సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు స్పెషల్‌ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి.

● ప్రొబేషనరీ సమయంలో రావాల్సిన నోషనల్‌ ఇంక్రిమెంట్లకు స్పష్టమైన ప్రైమ్‌ టైమ్‌ నిర్ణయించాలి.

● వార్డు సచివాలయాల్లోని ఖాళీలను 50 శాతం సచివాలయ సిబ్బందితో భర్తీ చేయాలి.

● సర్వేలను ఆయా శాఖల సంబంధిత ఉద్యోగులతో నిర్వహించి, సచివాలయ సిబ్బందిపై భారం తగ్గించాలి.

● గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రస్తుతం అమలవుతున్న రికార్డు అసిస్టెంట్‌ క్యాడర్‌ను జూనియర్‌ అసిస్టెంట్‌ క్యాడర్‌కు మార్పు చేయాలి.

● గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల స్టేషన్‌ సీనియారిటీ అధారంగా పారదర్శక బదిలీలు జరిగేలా ప్రత్యేక విధి విధానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేయాలి.

● అన్ని విభాగాల వారికి ప్రమోషన్‌ చానల్స్‌ ఏర్పాటు చేసి జిల్లాల వారీగా సీనియారిటీ జాబితాలను విడుదల చేయాలి

● విద్యార్హతల ఆధారంగా సచివాలయ ఉద్యోగులకు విధులు అప్పగించాలి

● ఇంటింటికి తిరిగి నిర్వహించే సర్వే లు, ఇతర పనుల నుంచి తప్పించాలి.

● గ్రామ, వార్డు సచివాయ ఉద్యోగులను వారి మాతృశాఖలకు అప్పగించాలి.

● సమయపాలన లేని ఒత్తిడితో కూడిన విధుల నుంచి విముక్తి కలిగించాలి. సెలవులు, ఆదివారాలు, పండగ సమయాల్లో పనులు చేయించరాదు.

డిమాండ్‌ నోటీసులతో సచివాలయ ఉద్యోగులు

క్రమ మండలం/ సచివా ఉద్యోగులు

సంఖ్య యూఎల్‌బీ లయాలు

1 అనపర్తి 19 102

2 బిక్కవోలు 21 144

3 గోకవరం 20 167

4 కడియం 27 195

5 కోరుకొండ 24 182

6 రాజమహేంద్రవరం రూరల్‌ 35 265

7 రాజానగరం 34 249

8 రంగంపేట 19 139

9 సీతానగరం 20 130

10 చాగల్లు 18 161

11 దేవరపల్లి 21 206

12 గోపాలపురం 18 148

13 కొవ్వూరు 19 156

14 నల్లజర్ల 22 184

15 నిడదవోలు 22 174

16 పెరవలి 20 161

17 తాళ్లపూడి 15 112

18 ఉండ్రాజవరం 19 157

19 కొవ్వూరు(అర్బన్‌) 10 93

20 నిడదవోలు(అర్బన్‌) 13 110

21 రాజమహేంద్రవరం అర్బన్‌ 96 753

మొత్తం 512 3,988

పది పనులను ఒక్కరే చేస్తున్నారు

పదిమంది అధికారులు పదిరకాల పనులు చెబుతున్నారు. వాటిని పూర్తి చేయడానికి ఇక్కడ ఒక్కరు మాత్రమే పనిచేసేవారు ఉండటం దారుణం. ఇది పోయి ఒకే లైన్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా పనిచేసే విధానం రావాలి. – దడాల జగ్జారావు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్‌ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్‌.

సచివాలయ ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు

1.30 లక్షల మంది సచివాలయం ఉద్యోగులు చాలా అసంతృప్తితో ఉన్నారు, లాస్ట్‌ గ్రేడ్‌ ఎంప్లాయీస్‌ పే స్కేల్‌ లో పదవ తరగతి విద్యార్హత వారికి ఇచ్చే జీతం సచివాలయ ఉద్యోగులకు ఇస్తున్నారు. ఆ తక్కువ జీతానికి కూడా న్యాయంగా రావాల్సిన నోషనల్‌ ఇంక్రిమెంట్స్‌, డీఏ, ఎరియర్స్‌, స్పెషల్‌ ఇంక్రిమెంట్లు రావడం లేదు. మా ఉద్యోగాలు సంస్థాగతంగా వలంటీర్స్‌ వ్యవస్థను మిళితం చేస్తూ రూపొందించారు. కానీ ఆ వ్యవస్థను రద్దు చెయ్యడం వల్ల మాకు పని భారం బాగా పెరిగిపోయింది. అలాగే క్షేత్ర స్థాయిలో పై అధికారుల వద్ద తగిన గౌరవం లేదు.

– కొల్లి రాజేష్‌, వార్డు పరిపాలన కార్యదర్శి, నగరపాలక సంస్థ, రాజమహేంద్రవరం

మాతృశాఖలో విలీనం చేయాలి

శానిటేషన్‌ సెక్రటరీలను మాతృ శాఖలో విలీనం చేసి, నిర్ధిష్టమైన ప్రమోషన్‌ చానల్‌, వర్క్‌ విధానం రూపొందించాలి. డిగ్రీ అర్హతతో రిక్రూట్‌ అయి, పదవ తరగతి అర్హత ఉన్న పోస్టుల ప్రమోషన్‌ చూపించడం జరిగింది.

ఇది చాలా దారుణం. అర్హత ప్రకారం ప్రమోషన్స్‌ ఇవ్వాలి.

– డీవీ సుబ్బారావు, మోటూరి,

వార్డు శానిటేషన్‌, ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీ

ప్రమోషన్‌ చానల్‌ లేదు

ఉద్యోగంలో చేరి 6 సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ నిర్ధిష్టమైన ప్రమోషన్‌ చానల్‌ లేదు. జీఓ 523ని సవరించి ఎంఏ, యూడిలో ఉన్న వార్డు కార్యదర్శులకు అర్హతల ఆధారంగా ప్రమోషన్‌ కల్పించాలి.

– సంజయ్‌ డేవిడ్‌, వార్డు ఎమినిటీస్‌ సెక్రటరీ, రాజమహేంద్రవరం

 గొడ్డు చాకిరీలు.. గొర్రె తోక జీతాలు!1
1/4

గొడ్డు చాకిరీలు.. గొర్రె తోక జీతాలు!

 గొడ్డు చాకిరీలు.. గొర్రె తోక జీతాలు!2
2/4

గొడ్డు చాకిరీలు.. గొర్రె తోక జీతాలు!

 గొడ్డు చాకిరీలు.. గొర్రె తోక జీతాలు!3
3/4

గొడ్డు చాకిరీలు.. గొర్రె తోక జీతాలు!

 గొడ్డు చాకిరీలు.. గొర్రె తోక జీతాలు!4
4/4

గొడ్డు చాకిరీలు.. గొర్రె తోక జీతాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement