తాళ్లరేవు: జాతీయ రహదారిపై మట్లపాలెం వంతెన వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వలిపూడి గోవరాజు (41) మృతి చెందాడు. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. పటవల పంచాయతీ కొత్తూరుకు చెందిన గోవరాజు రాత్రి సమయంలో రోడ్డు దాటుతుండగా యానాం వైపు నుంచి కాకినాడ వెళుతున్న లారీ ఢీకొంది.
ఈ ప్రమాదంలో గోవరాజు తలకు తీవ్ర గాయమైంది. అతడిని స్థానికులు హుటాహుటీన కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. గోవరాజుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శతాధిక వృద్ధుడి మృతి
అల్లవరం: కొమరగిరిపట్నం గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు గుర్రం గంగాధర్ (బాబ్జి) తండ్రి కొండలరావు (100) గురువారం ఉదయం మృతి చెందారు. ఆయన భౌతిక కాయాన్ని పలువురు రాజకీయ ప్రముఖులు, గ్రామస్తులు సందర్శించి, శద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

లారీ ఢీకొని వ్యక్తి మృతి