
అయోధ్యకు తరలిన విల్లు, బాణం
కపిలేశ్వరపురం (మండపేట): అయోధ్యలో నిర్మిస్తున్న కల్యాణ రాముని ఆలయానికి సమర్పించేందుకు దాత విల్లు, బాణం తయారీకి మండపేటలో ఆర్డర్ చేశారు. మండపేటలోని రామకృష్ణా బ్రాస్ అండ్ సిల్వర్ వర్క్స్ నిర్వాహకుడు, శిల్ప కళాకారుడు వాసా శ్రీనివాస్ గోల్డ్ కోటింగ్‌తో వీటిని రూపొందించారు. అయోధ్యకు చెందిన వంశవృక్షం అన్నదాన ట్రస్ట్ నిర్వాహకులు చల్లా శ్రీనివాస్ శాస్త్రి, గాయత్రి దంపతులు రూ.1.80 లక్షలతో తయారు చేయించారు. వాటిని గురువారం చల్లా శ్రీనివాస్ శాస్త్రి అయోధ్య నుంచి మండపేటకు వచ్చి తీసుకెళ్లారు. కళాకారుడు వాసా శ్రీనివాస్ నైపుణ్యాన్ని ఆయన ప్రసంశించారు.