
ఎంపీ మిథున్‌రెడ్డికి ఘన స్వాగతం
– పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నేతలు
సాక్షి, రాజమహేంద్రవరం: లిక్కర్ అక్రమ కేసులో మధ్యంతర బెయిల్‌పై వెళ్లిన ఎంపీ మిథున్‌రెడ్డి తిరిగి గురువారం మధ్యాహ్నం 4.35 గంటలకు సెంట్రల్ జైల్లో సూపరింటెండెంట్ ఎదుట హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రాజమహేంద్రవరం వచ్చారు. తొలుత వీఎల్‌పురం మార్గాని ఎస్టేట్స్‌లోని వైఎస్సార్ సీపీ సిటీ కార్యాలయాన్ని సందర్శించారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం ఆయన వెంట వచ్చారు. మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్, పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులు పూలు జల్లి, శాలువాలు కప్పి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వేదమంత్రాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి మంజీర హోటల్‌కు చేరుకుని అక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్, మాజీ మంత్రి తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావ్, జి.శ్రీనివాసులనాయుడు, సత్తి సూర్యనారాయణరెడ్డి, పొన్నాడ సతీష్, పాముల రాజేశ్వరి, జ్యోతుల చంటిబాబు, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ షర్మిలారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు, మాజీ ఎంపీ వంగా గీత, రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, పి.గన్నవరం నియోజకవర్గ ఇన్‌చార్జిలు జి.శ్రీనివాసరావు తదితరులు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఎంపీ మిథున్‌రెడ్డికి నేతలందరూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.